మెగా కోడలు లావణ్య త్రిపాఠి జీవితం సమంతలా మారిపోనుందా.. తెరపైకి వచ్చిన షాకింగ్ విషయాలు!

by Hamsa |
మెగా కోడలు లావణ్య త్రిపాఠి జీవితం సమంతలా మారిపోనుందా.. తెరపైకి వచ్చిన షాకింగ్ విషయాలు!
X

దిశ, సినిమా: ఇండస్ట్రీలో ఓ వార్త బాగా ట్రెండ్ అవుతోంది. చాలా మంది హీరోయిన్లు పెళ్లికి ముందు వరుస సినిమాలతో ఇండస్ట్రీలో రాజ్యమేలినప్పటికీ.. పెద్దింటి కోడలిగా వెళ్లాక సైలెంట్ అయిపోతున్నారు. పూర్తిగా చిత్రాలు చేయడకుండా అటు సోషల్ మీడియాలోనూ అంత యాక్టివ్‌గా ఉండకుండా.. పూర్తిగా ఇంటికే పరిమితం అవుతున్నారు. కొందరు ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పటికీ అత్తింటి వారు పెట్టే ఆంక్షల వల్ల నటనకు దూరమవుతున్నారు. అయితే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత పెళ్లికి ముందు ఇండస్ట్రీకి షేక్ చేసిన ఆమె.. వివాహం తర్వాత అడపాదడపా సినిమాలు చేసింది. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎక్కువగా పెట్టడం వల్లే విడాకులు కూడా తీసుకుందనే చర్చ గత కొద్ది కాలంగా వైరల్ అవుతూనే ఉంది.

విడాకులు అయినప్పటికీ మయోసైటీస్ కారణంగా సామ్ సినిమాలు చేయడం లేదు. సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉండి హెల్గ్ పాడ్ కాస్ట్ వీడియోలు షేర్ చేస్తోంది. తాజాగా, సమంత జీవితం లాగే మరో హీరోయిన్ కూడా కాబోతుందంటూ ఓ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. ఆమె ఎవరో కాదు.. మెగా కోడలు లావణ్య త్రిపాఠి. ఈ అమ్మడు పలు హిట్స్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఈ క్రమంలోనే.. మెగా హీరో వరుణ్ తేజ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇక అప్పటి నుంచి సినిమాలు చేయడం లేదు. వివాహం తర్వాత కేవలం ఒక్క మూవీ తప్ప మరే ప్రాజెక్ట్ ప్రకటించలేదు.

అలాగే సోషల్ మీడియాలోనూ అంతంత మాత్రంగా ఉంటుంది. ఎప్పుడో ఒకసారి పోస్టులు పెడుతుంది. దీంతో పెద్దింటి కోడళ్లు అయ్యాక హీరోయిన్స్ దుస్థితి ఇలాగే మారుతుందా? అని పలు అనుమానాలు తెరపైకి వచ్చాయి. అలాగే అత్తింటి వారు పెట్టే రూల్స్ వల్ల విడాకులు అవుతున్నట్లు వార్తలు కూడా వస్తుండటం గమనార్హం. సమంత జీవితంలాగే లావణ్యది కూడా తొందరలో మారిపోనుందని పుకార్లు షికారు చేస్తున్నాయి. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. దీంతో పలువురు రకరకాలుగా చర్చించుకుంటున్నారు.Next Story