దుబాయ్ నుండి రాగానే ఫ్యామిలీ గొడవ పై స్పందించిన మంచు విష్ణు.. ఏమన్నారంటే..?

by Mahesh |   ( Updated:2024-12-10 06:13:24.0  )
దుబాయ్ నుండి రాగానే ఫ్యామిలీ గొడవ పై స్పందించిన మంచు విష్ణు.. ఏమన్నారంటే..?
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ హీరో మంచు మోహన్ బాబు ఫ్యామిలిలో గొడవలు తలెత్తాయి. దీంతో ఒకరి పై ఒకరు తమపై దాడి చేశారని.. తండ్రి మోహన్ బాబు(mohan babu), కొడుకు మనోజ్(majoj) పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసుకున్నారు. కాగా ఈ ఘటనపై స్పందించిన పోలీసులు మోహన్‌బాబు ఫిర్యాదుతో మనోజ్‌, అతని భార్య మౌనిక(bhuma mounika)పై 329, 351 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అలాగే మనోజ్‌ ఫిర్యాదుతో మోహన్‌బాబు అనుచరులపై కేసు 329, 351, 115 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే ఈ వివాదం వేళ దుబాయ్ లో ఉన్న మంచు విష్ణు(manchu vishnu) హుటాహుటిన ఈ రోజు తెల్లవారుజామున హైదరాబాద్ చేరుకున్నారు.

మార్గమధ్యంలో విలేకర్లు విష్ణును ప్రశ్నించగా.. కుటుంబంలో చిన్నపాటి సమస్యలు తలెత్తినా మాట వాస్తవమే. మా ఫ్యామిలీలో అంతర్గతంగా జరిగిన వివాదాన్ని పెద్దగా చిత్రీకరించడం తగదు. త్వరలోనే సమస్యలన్నీ పరిష్కారమవుతాయి అని మంచు విష్ణు చెప్పుకొచ్చారు. అంతకు ముందు.. మోహన్ బాబు పోలీసులతో మాట్లాడుతూ.. అన్నదమ్ముల మధ్య గొడవలు సహజం. ఇళ్లలో గొడవలైతే అంతర్గతంగా పరిష్కరించుకుంటారు. గతంలో ఎన్నో కుటుంబ వివాదాలు పరిష్కరించా కుటుంబాలు కలిసేలా చేశానని చెప్పుకొచ్చారు. దీంతో మంచు ఫ్యామిలీ వివాదం ఏ క్షణం ఏ మలుపు తిరుగుతుందో అర్ధ కాక ఫ్యాన్స్ ఆందోళనకు గురవుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed