- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అత్యుత్సాహం కాస్త ఇబ్బందే.. వైరల్‌గా మహేశ్ బాబు కామెంట్స్
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన కెరీర్‌లో అత్యంత భారీ ప్రాజెక్ట్ ‘వారణాసి’తో బిజీగా ఉన్నాడు.

దిశ, సినిమా: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన కెరీర్‌లో అత్యంత భారీ ప్రాజెక్ట్ ‘వారణాసి’తో బిజీగా ఉన్నాడు. దర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ ప్రాజెక్టుపై దేశవ్యాప్తంగా ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించిన వీడియోస్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో లీక్ అవుతూ సంచలనం సృష్టిస్తున్నాయి. ఇవేవి పట్టించుకోని రాజమౌళి వన విజన్‌లో తాను దూసుకుపోతున్నాడు. ఇక షూటింగ్‌ల నిమిత్తం వేరే దేశాలకు వెళ్లేటప్పుడు, లేదా ఫ్యామిలీతో వెళ్లేటప్పుడు ఎయిర్ పోర్టులో కొందరు చూపించే అత్యుత్సాహంపై తన అభిప్రాయం వ్యక్తం చేశాడు మహేశ్ బాబు. ‘అప్పట్లో ఫోన్లకు కెమెరాలు ఉండేవి కాదు కాబట్టి.. బయట తిరిగిన పెద్ద ఇబ్బందిగా అనిపించేది కాదు. ఇప్పుడు అలా కాదు ఎయిర్ పోర్టులో దిగితే ఒక్కొక్కళ్లు సెల్ఫీలు అంటూ ఎగబడతారు. అది తప్పు అని నేను అనడం లేదు.. ఫ్యాన్స్ ఉత్సాహం అలాగే ఉంటుంది. కానీ, ఆ ఉత్సాహం ఓవర్ అయినప్పుడు మాత్రమే ప్రైవసీకి బంగం కలిగిద్ది. ఎప్పుడో ఒకసారి ఇలా జరిగితే పర్వాలేదు కానీ, ఎప్పుడు ఇదే జరుగుతుంటే కొంచెం ఇబ్బంది అంతే’ అంటూ చెప్పుకొచ్చాడు మహేశ్ బాబు.






