కియారా అద్వానీ షాకింగ్ డిమాండ్స్.. దిల్ రాజ్ వాటికి ఒప్పుకోవడం వల్ల ‘గేమ్ ఛేంజర్’ చేస్తుందా?

by Hamsa |
కియారా అద్వానీ షాకింగ్ డిమాండ్స్.. దిల్ రాజ్ వాటికి ఒప్పుకోవడం వల్ల ‘గేమ్ ఛేంజర్’ చేస్తుందా?
X

దిశ, సినిమా: స్టార్ డైరెక్టర్ శంకర్, రామ్ చరణ్ కాంబోలో ‘గేమ్ ఛేంజర్’ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ మూవీలో గ్లోబల్ స్టార్ డబుల్ రోల్ చేస్తున్నాడు. రాజకీయ నాయకుడిగా.. ఐఏఎస్ ఆఫీసర్‌గా కనిపించి మెప్పించనున్నాడు. అయితే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ఇప్పటికే స్టార్ట్ అయి చాలా రోజులవుతుంది. ఈ ఏడాది చివరి వరకు విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇందులో కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే గేమ్ ఛేంజర్ ఒప్పుకోవడానికి కియారా నిర్మాత దిల్ రాజుకు పలు కండీషన్స్ పెట్టినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వాటికి ఒప్పుకోవడం వల్ల ఈ సినిమా చేయడానికి ఓకే చెప్పిందని నెట్టింట టాక్.

షూటింగ్ తర్వాత ప్రయాణం లగ్జరీగా ఉండాలి, పర్సనల్ జిమ్ ట్రైనర్, అది కూడా ముంబై నుంచి రప్పించాలని చెప్పిందట. అలాగే ఫుడ్ ప్రిపేర్ చేయడానికి ఓ చెఫ్‌ను కూడా ఏర్పాటు చేయించాలని డిమాండ్ చేసిందట. వాటికి దిల్ రాజ్ ఒప్పుకోవడంతో గేమ్ ఛేంజర్ షూటింగ్‌లో పాల్గొంటుందని తెలుస్తోంది. అయితే వీటన్నింటికీ ఏకంగా రూ. 60 లక్షల వరకు ఖర్చు అవుతుందని సమాచారం. అయినప్పటికీ నిర్మాత ఒప్పుకోవడానికి కారణం ఆ క్యారెక్టర్ ఆమె అయితే బాగా చేస్తుందని అలాగే.. కియారాకు ఉన్న ఫాలోయింగ్‌ను దృష్టిలో పెట్టుకుని డిమాండ్స్‌కు ఒప్పుకున్నారట. ఇందులో నిజం ఎంత అనేది తెలియనప్పటికీ.. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Next Story

Most Viewed