- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘డ్యూడ్’ సీక్వెల్‌పై క్లారిటీ ఇచ్చిన కీర్తిశ్వరన్.. నెక్ట్స్ ప్రాజెక్ట్ ఆ స్టార్ హీరోతోనే అంటూ ఆసక్తికర కామెంట్స్
హీరో శింబు కోసమే స్క్రిప్ట్‌ను సిద్ధం చేస్తున్నట్లు ప్రకటించారు.

దిశ, సినిమా: కీర్తీశ్వరన్ ‘డ్యూడ్’ సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీకి వచ్చాడు. మొదటి మూవీతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ప్రదీప్ రంగనాథన్, మమిత బైజు జంటగా నటించిన ఈ యూత్‌ఫుల్ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ప్రేక్షకులను ఎంతగానో కట్టిపడేసింది. ఈ సినిమా విడుదలై దాదాపు ఆరు నెలలు కావస్తున్నా, థియేటర్లలో దీనికి వచ్చిన రెస్పాన్స్ పట్ల కీర్తీశ్వరన్ ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. తన జీవితమంతా కేవలం ఆ ఒక్క సినిమా కోసమే ఉద్దేశించబడిందేమో అనేంతగా ఆ చిత్రం తనపై ప్రభావం చూపిందని ఆయన అన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన తదుపరి ప్రాజెక్ట్ ‘డ్యూడ్ 2’ సీక్వెల్ గురించి ఆయన ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఇటీవల తాను హీరో ప్రదీప్ రంగనాథన్‌ను కలిసి ఒక కొత్త లైన్ చెప్పినట్లు కీర్తీశ్వరన్ తెలిపారు. ఆ ఐడియా ప్రదీప్‌కు బాగా నచ్చిందని, అందులో ‘డ్యూడ్’ సినిమాకు సంబంధించిన ఆత్మ దాగుందని పేర్కొన్నారు.
ఒకవేళ అంతా అనుకున్నట్లు కుదిరి ఆ కథ పూర్తిస్థాయిలో కార్యరూపం దాల్చితే.. దానిని ‘డ్యూడ్ 2’ గానే రూపొందిస్తామని స్పష్టం చేశారు. అలాగే తన నెక్ట్స్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతూ.. ప్రస్తుతం తాను ఒక అద్భుతమైన మాస్ అంశాలు, బలమైన భావోద్వేగాలతో కూడిన కథను రాస్తున్నట్లు కీర్తీశ్వరన్ వెల్లడించారు. ఈ పవర్‌ఫుల్ కథకు ఒక పెద్ద స్టార్ అవసరమని, అందుకే తాను ఎప్పటి నుంచో ఎవరితోనైతే పనిచేయాలని అనుకుంటున్నారో.. ఆ స్టార్ హీరో శింబు కోసమే ఈ స్క్రిప్ట్‌ను సిద్ధం చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం ఈ కథా చర్చలు ముమ్మరంగా సాగుతున్నాయని, త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వస్తుందని దర్శకుడు కీర్తీశ్వరన్ క్లారిటీ ఇచ్చారు.






