యానిమల్‌లో బోల్డ్‌గా నటించిన తృప్తి విరాట్ కోహ్లీకి చెల్లెలా.. బయటపడ్డ సీక్రెట్!

by Disha Web Desk 6 |
యానిమల్‌లో బోల్డ్‌గా నటించిన తృప్తి విరాట్ కోహ్లీకి చెల్లెలా.. బయటపడ్డ సీక్రెట్!
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, డైరెక్టర్ వంగా సందీప్ రెడ్డి కాంబినేషన్‌లో వచ్చిన ‘యానిమల్’. ఇందులో నేషనల్ క్రష్ రష్మిక హీరోయిన్‌గా నటించగా.. బాలీవుడ్ నటి త్రిప్తి దిమ్రీ కీలక పాత్ర పోషించింది. అయితే రష్మిక మందన్నకు మించి ప్రేక్షకుల దృష్టిని తన వైపుకు తిప్పుకుంది త్రిప్తి. ఏకంగా రణబీర్ కపూర్ తో డీప్ రొమాంటిక్ సీన్లలో నటించిన ఈ ముద్దుగుమ్మ.. ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్గా గుర్తింపుని సంపాదించుకుంది. సోషల్ మీడియాలో ఈ అమ్మడు గురించే చర్చించుకుంటున్నారు. తన అందం అభినయంలో కుర్రకారును ఫిదా చేసిన త్రిప్తి గురించి ఎన్నో రకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా, త్రిప్తి, ఇండియన్ స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి చెల్లెలు అవుతుందని ఓ వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

తృప్తి గతంలో హిందీలో ‘బుల్బుల్’ అనే సినిమాలో నటించింది. ఈ సినిమాకు నిర్మాత కర్నేష్ శర్మ. ఈయన స్వయాన విరాట్ భార్య అనుష్క శర్మకు అన్నయ్య. ఆ మూవీ సమయంలో తృప్తికి కర్ణేష్ కి మధ్య ప్రేమ చిగురించింది. తర్వాత పార్టీలు పబ్బులు అంటూ ఎంజాయ్ చేశారు. వీరిద్దరి సంబంధించిన పలు ఫొటోలు కూడా నెట్టింట వైరల్ అయ్యాయి. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. అయితే విరాట్, కర్నేష్ శర్మ బావ అయినప్పుడు.. అతన్ని పెళ్లి చేసుకోబోయే తృప్తి విరాట్ కోహ్లీ చెల్లెలు అవుతుందంటూ కొంతమంది సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. ఇక ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.


Next Story