- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మళ్లీ వింటేజ్ ప్రభాస్‌ను చూడబోతున్నారు.. ఫౌజీ సినిమాపై ఇంట్రెస్టింగ్ బజ్
ప్రభాస్, హను రాఘవపూడి కలయికలో వస్తున్న ‘ఫౌజీ’ సినిమాకు సంబంధించిన స్టోరీ లైన్ ఒకటి నెట్టింట సందడి చేస్తుంది.

దిశ, సినిమా: తెలుగు సినిమాల్లో హీరో, హీరోయిన్ ప్రేమకథలు అరుదుగా కనిపిస్తున్న వేళ, ఇప్పుడు ఆ లోటును ఫౌజీ భర్తీ చేస్తుందనే చర్చ జరుగుతోంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేతినిండా ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా మారిపోయాడు. ఇందులో ఫౌజీ ఒకటి. హను రాఘవపూడి దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో ఎక్కడ రాజీ పడకుండా నిర్మిస్తున్న ఈ మూవీలో ఇమాన్వి హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుండగా.. తాజాగా దీనికి సంబంధించిన ఓ బజ్ నెట్టింట సందడి చేస్తుంది. ఈ సినిమాలో భారీ యాక్షన్‌తో పాటు ప్రభాస్, ఇమన్వి మధ్య సాగే రొమాంటిక్ ట్రాక్‌నే ఈ సినిమా ప్రధాన బలంగా నిలవనుందని సమాచారం. దర్శకుడు హను రాఘవపూడి ఈ అంశంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. రాధే శ్యామ్ తర్వాత మరోసారి ప్రేమకథ ప్రధానంగా ఉన్న చిత్రంలో కనిపిస్తున్న ప్రభాస్‌కు ఇది కీలక ప్రాజెక్ట్ కానుండగా.. మంచి భావోద్వేగాలతో కూడిన ప్రేమకథ ఉంటే ఫౌజీ ప్రత్యేకంగా నిలిచే అవకాశం ఉందని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానప్పటికీ ప్రస్తుతం ఇందుకు సంబంధించిన న్యూస్ నెట్టింట వైరల్ అవుతుండగా.. మళ్లీ మా వింటేజ్ ప్రభాస్ రాబోతున్నాడు అన్నమాట అంటూ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.






