- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నా సోదరుడిని చూసి గర్వపడుతున్నా.. రామ్ చరణ్ ‘పెద్ది’ మూవీకి ఐకాన్ స్టార్ రివ్యూ
రఫ్ అండ్ రా లుక్, బాడీ ట్రాన్స్‌ఫార్మేషన్ చూసి ఆశ్చర్యపోయానని బన్నీ చెప్పారు. చరణ్ చేసిన గ్రేస్‌ఫుల్ డ్యాన్స్ మూవ్స్ కూడా చాలా బాగున్నాయని మెచ్చుకున్నారు.

దిశ, సినిమా: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబోలో వచ్చిన ప్రతిష్టాత్మక చిత్రం ‘పెద్ది’. భారీ అంచనాల మధ్య జూన్ 4న విడుదలైన ఈ సినిమా బ్లా్క్ బస్టర్ హిట్ టాక్‌తో దూసుకుపోవడంతో పాటుగా వివాదాల్లో చిక్కుకుంటోంది. అయినప్పటికీ ఈ సినిమా కలెక్షన్స్ ఏ మాత్రం తగ్గడం లేదు. కొన్ని వివాదాలు చుట్టుముట్టినప్పటికీ, ఆన్‌లైన్‌లో హెచ్‌డీ ప్రింట్ లీక్ అయినప్పటికీ.. థియేటర్లలో ఈ సినిమా కలెక్షన్ల సునామీ ఏ మాత్రం తగ్గడం లేదు. కేవలం 5 రోజుల్లోనే రూ.300 కోట్లకు పైగా వసూలు చేసి ఈ చిత్రం సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఈక్రమంలో.. తాజాగా, అల్లు అర్జున్ నిన్న రాత్రి 'పెద్ది' సినిమా చూసి ప్రశంసలు కురిపిస్తూ ట్విట్టర్ ద్వారా ఓ పోస్ట్ పెట్టారు. నా సోదరుడు చరణ్ తన అద్భుతమైన నటనతో సినిమాలో అదరగొట్టేశాడని, ముఖ్యంగా ఆ రఫ్ అండ్ రా లుక్, బాడీ ట్రాన్స్‌ఫార్మేషన్ చూసి ఆశ్చర్యపోయానని బన్నీ చెప్పారు. చరణ్ చేసిన గ్రేస్‌ఫుల్ డ్యాన్స్ మూవ్స్ కూడా చాలా బాగున్నాయని మెచ్చుకున్నారు.తన సోదరుడు రామ్ చరణ్‌ను చూస్తుంటే చాలా గర్వంగా ఉందని, అతనికి వస్తున్న ప్రశంసలన్నీ అతను కష్టానికి దక్కిన ప్రతిఫలమేనని బన్నీ చెప్పారు. అలాగే, సీనియర్ నటుడు జగపతి బాబు గారి నటనతో పాటు మిగిలిన వారందరూ చాలా బాగా నటించారని అభినందించారు.
హీరోయిన్ జాన్వీ కపూర్‌కు తన బెస్ట్ విషెస్ తెలియజేస్తూ, చిత్ర నిర్మాతలకు కూడా శుభాకాంక్షలు చెప్పారు. ముఖ్యంగా దర్శకుడు బుచ్చిబాబు సనా గురించి మాట్లాడుతూ.. సినిమా అనే ఓడకు కెప్టెన్ అయిన బుచ్చిబాబు ప్రతి పాత్రను చాలా బాగా ఎలివేట్ చేశారని ప్రశంసించారు. రామ్ చరణ్‌ను ఒక అత్యున్నత స్థాయిలో నిలబెట్టినందుకు బుచ్చిబాబుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. మొత్తానికి 'పెద్ది' టీమ్ అందరికీ అల్లు అర్జున్ తన హృదయపూర్వక శుభాకాంక్షలు అందించారు. ఇక అల్లు అర్జున్ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ రివ్యూతో అటు మెగా అభిమానుల్లో, ఇటు అల్లు అర్జున్ ఫ్యాన్స్‌లో సరికొత్త జోష్ నెలకొంది. అయితే గత కొద్ది కాలంగా అల్లు, మెగా ఫ్యామిలీలో పలు గొడవలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ వివాదాల కారణంగా కాస్త దూరంగా ఉంటున్నట్లు ప్రచారం కూడా జరిగింది. ఈనేపథ్యంలోనే అల్లు అర్జున్ ‘పెద్ది’కి రివ్యూ ఇవ్వడంతో రెండు కుటుంబాలు మళ్లీ కలిసిపోయిట్లు తెలుసుకున్న మెగా అభిమానులు ఆనందపడుతున్నారు.






