పుష్ప-2 హిట్ అయినా నేను హ్యాపీగా లేను.. డైరెక్టర్ సుకుమార్ బావోద్వేగం

by Mahesh |   ( Updated:2024-12-07 16:48:21.0  )
పుష్ప-2 హిట్ అయినా నేను హ్యాపీగా లేను.. డైరెక్టర్ సుకుమార్ బావోద్వేగం
X

దిశ, వెబ్ డెస్క్: డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన పుష్ప-2 (Pushpa-2) సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అయితే ఈ సినిమా ప్రీమియర్ షో వేడుకల్లో తొక్కిసలాట(Stampede) జరిగి.. ఓ మహిళ మృతి చెందగా మరో బాలుడికి తీవ్ర గాయాలైన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనపై స్టేషన్ లో కేసు కూడా నమోదైంది. అయితే సినిమా బ్లాక్ బస్టర్ అయినప్పటికి.. హీరో, డైరెక్టర్ మాత్రం.. మహిళ మృతి(woman died) సంఘటనతో అప్ సెట్ అయ్యారు. ఈ క్రమంలోనే ఈ రోజు ఆ సినిమా 500 కోట్లు వసూల్ చేసినందుకు సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్ సుకుమార్(Director Sukumar) మాట్లాడుతూ.. తాను తీసిన సినిమా భారీ విజయం సాధించినప్పటికీ తాను సంతోషంగా లేనని.. తాను మూడు సంవత్సరాల్లో సినిమా తీసిన.. ఆరు సంవత్సరాలు కష్టపడి మరో సినిమా తీసిన.. ఒక ప్రాణాన్ని తిరిగి తీసుకురాలనేనని, క్రియేట్ చేయలేనని.. తాను మూడు రోజుల నుంచి హ్యాపీగా లేనని చెప్పుకొచ్చారు. ఆ ఘటన జరగడం తో తన మనస్సు విఫలం అయిందని.. ఇదే విషయంపై చర్చించుకొని బయటకు వచ్చి.. బాధిత కుటుంబానికి భరోసా కల్పించామని, మేము ఎప్పుడు వారికి సపోర్టుగా ఉంటామని డైరెక్టర్ సుకుమార్ భావోద్వేగంతో చెప్పుకొచ్చారు.

Read More...

Rashmika Mandanna: ‘ది గర్ల్ ఫ్రెండ్’ మూవీ టీజర్‌‌ రిలీజ్ డేట్ ఫిక్స్.. కుర్రాళ్లను ఫిదా చేస్తున్న రష్మిక పోస్...


Advertisement

Next Story

Most Viewed