‘HIT 3’: హైప్ పెంచేస్తున్న నాని లేటెస్ట్ పోస్టర్.. ఈ సారి దబిడి దిబిడే

by Kavitha |
‘HIT 3’: హైప్ పెంచేస్తున్న నాని లేటెస్ట్ పోస్టర్.. ఈ సారి దబిడి దిబిడే
X

దిశ, వెబ్‌డెస్క్: నేచురల్‌ స్టార్‌ నాని(NATURAL STAR NANI)ప్రస్తుతం బ్యాక్‌ టూ బ్యాక్‌ హిట్స్‌తో దూసుకుపోతున్నాడు. గతేడాది దసరా(DASARA), హాయ్‌ నాన్న(HAI NANNA) వంటి సినిమాతలో వరుసగా బ్లాకబస్టర్స్‌ అందుకున్న నాని.. ఈ ఏడాది సరిపోదా శనివారంతో(SARIPODHA SHANIVARAM) మరో హిట్‌ కొట్టాడు. దీంతో నాని హ్యాట్రిక్‌ హిట్స్‌తో ఫుల్‌ జోష్‌ మీద ఉన్నాడు. రెండేళ్లుగా నాని ఒక సినిమా రిలీజ్‌ చేస్తూనే మరో సినిమాను ప్రకటిస్తున్నాడు. ఇప్పటికే నాని చేతిలో పలు ప్రాజెక్ట్స్‌ ఉన్నాయి. శ్రీకాంత్‌ ఓదేలతో ఓ సినిమాకు ఇప్పటికే కమిట్‌ అయ్యాడు.

అలాగే తన నిర్మాణంలో వస్తున్న 'హిట్‌2'కి సీక్వెల్‌ని కూడా ప్రకటించాడు. ఇక ఆయన లేటెస్ట్‌ మూవీ సరిపోదా శనివారం థియేటర్లో సక్సెస్‌ ఫుల్‌గా ఆడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మరో చిత్రాన్ని పట్టాలెక్కించే పనిలో పడ్డాడు హీరో నాని. అందులో భాగంగా రీసెంట్‌గా ఓ ఆసక్తికర పోస్టర్‌తో ఈ మూవీ అప్టేడ్ సెప్టెంబర్‌ 5న అధికారంగా ప్రకటించబోతున్నట్టు పేర్కొన్న విషయం తెలిసిందే.

అందులో భాగంగా నేడు నాని ‘హిట్ 3’ (HIT3)మూవీ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. అందులో సర్కార్ బాధ్యతలు స్వీకరించాడు అనే క్యాప్షన్‌తో.. రక్తంతో ఉన్న గొడ్డలి పట్టుకొని స్మోక్ చేస్తూ కార్ డ్రైవింగ్ చేస్తున్నాడు హీరో నాని. ప్రస్తుతం ఈ మూవీ పోస్టర్ సినిమాపై హైప్‌ను పెంచేస్తోంది. కాగా ఈ మూవీ మే 1 2025న రిలీజ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక లేటెస్ట్ పోస్టర్ పై నెటిజన్లు.. కొంచెం గ్యాప్ ఇవ్వు అన్నా అని, మళ్లీ మరో బ్లాక్ బస్టర్ మూవీ అని, ఈ సారి దబిడి దిబిడే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed