- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Neha shetty: ‘తోడిపెళ్లికూతురుకు మంచి అనుభూతిని అందిస్తున్నాను’ అంటూ ఆకట్టుకుంటోన్న ఫొటోలు పంచుకున్న హీరోయిన్

దిశ, వెబ్‌డెస్క్: హీరోయిన్ నేహా శెట్టి (Neha Shetty) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. డీజే టిల్లు చిత్రంతో తెలుగు ప్రేక్షకుల్లో ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది ఈ బ్యూటీ. అలాగే పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన మెహబూబా సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసింది. ఈ మూవీలో ఆకాశ్ కథానాయకుడిగా నటించి.. ప్రేక్షకుల్ని మెప్పించారు. ఇండియా, పాకిస్థాన్ బోర్డర్ నేపథ్యంలో సాగే లవ్ స్టోరీగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
భారతదేశం, పాకిస్తాన్ యుద్ధం కాలంలో మరణించిన ప్రేమ జంట తిరిగి ఈ కాలంలో జన్మించడం అనే స్టోరీతో దర్శకుడు రూపొందించాడు. ముఖ్యంగా ఈ సినిమా పూరీ జగన్నాథ్ సొంత బ్యానర్‌లో నిర్మించడం విశేషం. తర్వాత ఈ బ్యూటీ డీజే టిల్లు మూవీతో ఓవర్ నైట్ భారీ క్రేజ్ సొంతం చేసుకుంది. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు.
విమల్ కృష్ణ దర్శకత్వం వహించిన డీజే టిల్లు చిత్రంలో సిద్ధు జొన్నలగడ్డ, నర్రా శ్రీనివాస్, బ్రహ్మాజీ, ప్రగతి వంటి తదితరులు కీలక పాత్రలో కనిపించి ప్రేక్షకుల్ని తమ అద్భుతమైన యాక్టింగ్ తో కట్టిపడేశారు. అంతేకాకుండా కడుపుబ్బా నవ్వించారు కూడా. తర్వాత నేహా శెట్టి గల్లీ రౌడీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, టిల్లు స్వ్కేర్ వంటి సినిమాల్లో నటించి తెలుగు జనాల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది.
ఇకపోతే ఈ ముద్దుగుమ్మ తాజాగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. సన్నిహితుల పెళ్లికి అటెండ్ అయినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట పంచుకుని..‘తోడిపెళ్లికూతురుకు మంచి అనుభూతిని అందిస్తున్నాను’ అంటూ ఓ క్యాప్షన్ జోడించింది. ప్రెజెంట్ ఈ పిక్స్ జనాల్ని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.