ఎన్టీఆర్‌తో రొమాన్స్ చేయబోతున్న గుప్పెడంత మనసు సీరియల్ నటి?

by Disha Web Desk 6 |
ఎన్టీఆర్‌తో రొమాన్స్ చేయబోతున్న గుప్పెడంత మనసు సీరియల్ నటి?
X

దిశ, వెబ్‌డెస్క్: బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్ గుప్పెడంత మనసు నటి జ్యోతిరాయ్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఇందులో జగతీ మేడంగా సంప్రదాయ దుస్తుల్లో కనిపించి తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. రిషి తల్లిగా ఆమె పండించిన సెంటిమెంట్ కు.. తెలుగు కుటుంబ ప్రేక్షకులు ఫిదా అయ్యారు. నిండుగా చీర కట్టుకుని.. పెద్ద బొట్టు పెట్టుకుని... జగతీ పాత్రలో జ్యోతిరాయ్ చాలా బాగా నటించారు. అయితే ఇటీవల ఆమె సోషల్ మీడియాలో గ్లామరస్ ఫొటోలు షేర్ చేసి సోషల్ మీడియాను షేక్ చేసింది. ఇక ఆమె పెళ్లై విడాకులు తీసుకున్నట్టు తెలుస్తోంది. 40 ఏళ్లకు దగ్గరగా ఉన్న జ్యోతీరాయ్.. దర్శకుడు సుకు పూరాజ్ తో డేటింగ్ లో ఉంది. వారిద్దరు కలిసి తిరుగుతూ.. ఫోటోలు దిగుతూ.. నెట్టింట సందడి చేస్తుంటారు.

తాజాగా, జ్యోతిరాయ్‌కి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. జ్యోతిరాయ్‌కి ఎన్టీఆర్ సినిమాలో ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. దేవర చిత్రం పూర్తి కాగానే.. ప్రశాంత్ నీల్‌తో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కబోతున్న ఈ చిత్రంలో జ్యోతిరాయ్ రొమాన్స్ చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. జ్యోతీరాయ్ ప్రియుడు సుకు పూరాజ్.. ప్రశాంత్ నీల్ కు మంచి ఫ్రెండ్ కావడంతో.. తన ప్రియురాలిని ఆ సినిమాలో తీసుకోవల్సిందిగా సజెస్ట్ చేశారట. దాంతో ఆమె ఈ మూవీలో నటించడం ఫిక్స్ అని సోషల్ మీడియాలో టాక్.

Next Story