- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఈ తరం వన్‌సైడ్ లవర్స్ కోసమే ‘దీవాన’ రాబోతోంది.. ట్రైలర్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్
వన్ సైడ్ లవ్ అంటే చస్తుంటాం.. మస్తుంటాది అంటూ ఈ జనరేషన్ ప్రేమికులకు ఈ సినిమా అంకితమిస్తున్నట్లు పేర్కొన్నారు.

దిశ, సినిమా: ‘శుభం’ సినిమాతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న హర్షిత్ రెడ్డి, ఇప్పుడు ‘దీవాన’ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. స్నేహ మణిమేగలై హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీకాంత్ సంగిశెట్టి తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా, ప్రమోషనల్ కంటెంట్, టీజర్‌తో యువతలో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఈ క్రేజీ లవ్ స్టోరీ జూన్ 19న థియేటర్లలో విడుదల కానుంది. సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో, తాజాగా చిత్ర యూనిట్ ట్రైలర్ రిలీజ్ డేట్‌ను ప్రకటించింది. జూన్ 11వ తేదీ ఉదయం 11:11 గంటలకు ‘దీవాన’ థండరింగ్ ట్రైలర్‌ను విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
ఈ సందర్భంగా వారు పెట్టిన పోస్ట్ వన్ సైడ్ లవర్స్‌ను ఆకట్టుకుంటోంది. గతంలో వచ్చిన తొలిప్రేమ, ఆర్య, ఆర్య 2, 7/జి బృందావన్ కాలనీ వంటి చిత్రాలు వన్‌సైడ్ ప్రేమ నేపథ్యంతో వచ్చి సెన్సేషన్ సృష్టించాయి. ఇప్పుడు ఈ తరం వన్ సైడ్ ప్రేమికుల భావోద్వేగాలను ప్రతిబింబించేలా ‘దీవాన’ సినిమా ఉండబోతోందని హర్షిత్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. "వన్ సైడ్ లవ్ అంటే చస్తుంటాం.. మస్తుంటాది" అంటూ ఈ జనరేషన్ ప్రేమికులకు ఈ సినిమా అంకితమిస్తున్నట్లు పేర్కొన్నారు. అసలు కథ ఏమిటో పూర్తిగా అర్థం కావాలంటే ట్రైలర్ చూడాల్సిందే అని మేకర్స్ ఊరిస్తున్నారు. అర్హ మీడియా, వి స్టూడియోస్ బ్యానర్స్‌పై వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు






