చరణ్ బ్లాక్ బస్టర్ చిత్రంలో హీరోయిన్ చాన్స్ మిస్ చేసుకున్న ఉపాసన?

by Disha Web Desk 9 |
చరణ్ బ్లాక్ బస్టర్ చిత్రంలో హీరోయిన్ చాన్స్ మిస్ చేసుకున్న ఉపాసన?
X

దిశ, వెబ్‌డెస్క్: మెగా హీరో రామ్ చరణ్-ఉపాసన గురించి సుపరిచితమే. అపోలో ఆసుపత్రికి చైర్మన్‌గా బాధ్యతలు వ్యవహరిస్తోన్న ఉపాసనను, చరణ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. 2012లో పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్న వీరు 11 ఏళ్ల తర్వాత పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. మెగా ఫ్యామిలీలోకి ఈ చిన్నారి ఎంట్రీ ఇవ్వడంతో మెగా కుటుంబం మొత్తం సంతోషంలో మునిగిపోయింది. ఇకపోతే ఉపాసన గురించి సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. ఉపాసన.. చరణ్‌ను వివాహం చేసుకోకముందు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వాలనుకుందట. దర్శక, నిర్మాతలు రామ్ చరణ్ నటించిన తొలి ‘చిరుత’ చిత్రంలో ఉపాసనను హీరోయిన్‌గా తీసుకుందామనే ఆలోచనలో ఉన్నారట. కానీ ఆమె తల్లిదండ్రులు సినీ పరిశ్రమ మనకు కలిసిరాదు. వైద్యరంగంలోనే అంతకంటే మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి.. అపోలో హాస్పిటల్స్ చైర్మన్ బాధ్యతలను ఉపాసనకు అప్పచెప్పారట. ఇక ఉపాసన ఎన్నో వేల మంది పేద ప్రజలకు ఉచితంగా వైద్యం అందించి గొప్ప మనసు చాటుకున్న విషయం తెలిసిందే. ఈ వార్త ఎంత వరకు నిజమో తెలియదు కానీ ప్రస్తుతం నెట్టింట చర్చానీయంశంగా మారింది.

Next Story

Most Viewed