అరుదైన వ్యాధితో బాధపడుతున్న యాంకర్ సుమ.. అసలు ఏమైందంటే?

by Hamsa |
అరుదైన వ్యాధితో బాధపడుతున్న యాంకర్ సుమ.. అసలు ఏమైందంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: బుల్లితెర యాంకర్ సుమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎన్నో షోస్‌లతో తనదైన యాంకిరింగ్‌తో చెరగని ముద్ర వేసుకుంది. ఇప్పటికే నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతూ అటు బుల్లితెర టీవీ షోలు మరొకవైపు వెండి తెర ఆడియో ఫంక్షన్లు, సినిమా రిలీజ్ ఫంక్షన్లతో పాటు సక్సెస్ మీట్ లు అంటూ చాలా బిజీగా గడిపేస్తోంది సుమ.

తాజాగా, ఓ యూట్యూబ్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకుందట. తాను కీలాయిడ్ టెండెన్స్ అనే స్కిన్ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నానని, ఈ చర్మ వ్యాధి కారణంగా కొన్ని సంవత్సరాలుగా ఎన్నో బాధలు, కష్టాలు అనుభవిస్తున్నానని తెలిపింది. అంతేకాకుండా ఈ సమస్య వల్ల ప్రతిసారి మేకప్ వేసుకున్నప్పుడు ఇబ్బంది పడాల్సి వస్తుందని, తన కెరీర్ మొదలు పెట్టిన కొత్తలో ముఖానికి మేకప్ ఎలా వేసుకోవాలి? ఎలా తీసేయాలి? వంటి విషయాలు కూడా తెలిసేవి కాదని.. అందుకే చర్మానికి ఈ డామేజ్ జరిగిందని. ఒక చోట గాయం అయితే అది పెద్దదిగా మారి చుట్టుపక్కలంతా వ్యాపించి మరింత పెద్ద గాయం అయ్యే అవకాశం కూడా ఉందని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం సుమ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారడంతో అవి చూసిన ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. మరి ఈ వార్త నిజమో కాదో తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం తెగ వైరల్ అవుతుంది. ఈ రూమర్‌పై సుమ గానీ, ఆమె టీం గానీ అధికారికంగా స్పందిస్తేనే క్లారిటీ రానుంది.

Next Story

Most Viewed