బాక్సాఫీసు వద్ద ‘పెద్ది’ సునామీ.. 5 రోజుల్లో ఎన్ని కోట్లు రాబట్టిందంటే?

by Mallepaka Hamsa |

ఈ సినిమాలో రామ్ చరణ్ కనిపించిన గ్రామీణ నేపథ్యం, క్రీడల అంశాలు, గుండెకు హత్తుకునే ఎమోషనల్ సీన్స్‌కు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.

బాక్సాఫీసు వద్ద ‘పెద్ది’ సునామీ.. 5 రోజుల్లో ఎన్ని కోట్లు రాబట్టిందంటే?
X

దిశ, సినిమా: ఉప్పెన’ వంటి సంచలన విజయం తర్వాత దర్శకుడు బుచ్చిబాబు సనా, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌తో కలిసి రూపొందించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘పెద్ది’. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా, మొదటి షో నుండే పాజిటివ్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద రికార్డులను తిరగరాస్తోంది. రామ్ చరణ్ మాస్ ఇమేజ్, బుచ్చిబాబు మేకింగ్ కలసి థియేటర్లలో మెగా అభిమానులకు పూనకాలు తెప్పిస్తున్నాయి. ఇప్పటికే రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన ఈ సినిమా.. హెచ్‌డీ ప్రింట్ ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వచ్చినప్పటికీ క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. భారీ కలెక్షన్లు రాబడుతూ బాక్సాఫీసును షేక్ చేస్తోంది.

తాజాగా, మూవీ మేకర్స్ ట్విట్టర్ ద్వారా కలెక్షన్లను ప్రకటించారు. కేవలం 5 రోజుల్లోనే రూ. 315కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి సునామీ సృష్టిస్తోంది. ఈ సినిమాలో రామ్ చరణ్ కనిపించిన గ్రామీణ నేపథ్యం, క్రీడల అంశాలు, గుండెకు హత్తుకునే ఎమోషనల్ సీన్స్‌కు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. సినిమాలో హీరోయిన్ జాన్వీ కపూర్‌పై సోషల్ మీడియాలో కొన్ని ట్రోల్స్ వస్తున్నప్పటికీ, సినిమా విజయాన్ని అవి ఏ మాత్రం ప్రభావితం చేయలేకపోయాయి. జగపతి బాబు, దివ్యేందు శర్మ, బొమన్ ఇరానీ, రవి కిషన్ వంటి దిగ్గజ నటుల పెర్ఫార్మెన్స్ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్‌గా మారింది. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలె వృద్ది సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు, ఇషాన్ సక్సేనా నిర్మించిన ఈ సినిమా లాభాల బాట పడుతోంది.

Next Story