- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
S. S. Stanley: ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. ప్రముఖ నటుడు మృతి
by Anjali |

X
దిశ, వెబ్‌డెస్క్: ఈ మధ్యకాలంలో సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా S. S. స్టాన్లీ (S S Stanley) అనే కోలీవుడ్ నటుడు కమ్ దర్శకుడు మరణించాడు. అనారోగ్య సమస్యతో కొద్ది రోజులుగా చెన్నై ఆసత్రిలో చికిత్స తీసుకున్నాడు. ఈ క్రమంలోనే ఈ దర్శకుడు కన్నుమూశాడు. ఈ వార్త విన్న పలువురు సినీ సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికన సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఈయన 12 సంవత్సరాల పాటు సహాయ దర్శకునిగా పనిచేశారు. తర్వాత తన మొదటి సినిమా ‘ఏప్రిల్ మాధాతిల్’ (April Maadhaathil)కు దర్శకత్వం వహించారు ఈ చిత్రం బాక్సాఫీస్‌లో విజయం సాధించింది. శ్రీకాంత్, స్నేహ నటించిన ఒక కాలేజ్ లవ్ స్టోరీ ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. ఈయన పలు తమిళ సినిమాల్లో కూడా నటించి మెప్పించారు. అయితే కొన్ని ఆర్థిక సమస్యల కారణంగా కొన్ని సినిమాలు ఆగిపోయాయని సమాచారం.
Next Story