Megastar Chiranjeevi : బర్త్ డే సర్‌ప్రైజ్.. చిరు కొత్త సినిమా టైటిల్ ప్రకటన

by  |
Megastar Chiranjeevi : బర్త్ డే సర్‌ప్రైజ్.. చిరు కొత్త సినిమా టైటిల్ ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇస్తున్నారు. తాజాగా చిరు బర్త్ డే కానుకగా ఆయన నటించబోయే తర్వాతి సినిమాకు సంబంధించి మరో ప్రకటన వచ్చేసింది. కోలీవుడ్‌లో సూపర్ హిట్ అయిన ‘వేదాళం’ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తుండగా.. ఇందులో చిరు హీరోగా నటించనున్న విషయం తెలిసిందే. మెహర్ రమేష్ ఈ సినిమాను తెరకెక్కించనుండగా.. దీనికి ‘భోళా శంకర్’ అనే టైటిల్ ఖరారు చేశారు.

https://twitter.com/urstrulyMahesh/status/1429284693959057417

చిరు బర్త్ డే సందర్భంగా సినిమా యూనిట్ టైటిల్ ప్రకటించింది. సూపర్ స్టార్ మహేష్ బాబు టైటిల్ మోషన్ పోస్టర్‌ను ట్విట్టర్‌లో విడుదల చేసి చిరుకు విషెస్ చెప్పాడు. ఇందులో చిరు డిఫరెంట్ లుక్‌లో కనిపించనుండగా.. అన్నాచెల్లెళ్ల మధ్య ఉన్న అనుంబంధాలను ఈ సినిమాలో చూపించనున్నారని తెలుస్తోంది. ఇందులో చిరుకి చెల్లెలిగా కీర్తి సురేష్ కనిపించనుందని ప్రచారం జరుగుతోంది. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై అనిల్ సుంకర ఈ సినిమాను నిర్మించనున్నారు.

Next Story

Most Viewed