మీ సహాయం.. కార్మికులకు ఓ భరోసా : చిరు

by  |
మీ సహాయం.. కార్మికులకు ఓ భరోసా : చిరు
X

దిశ, వెబ్‌డెస్క్: బాధ్యత.. బంధాన్ని బలపరుస్తుంది. కష్టాల్ని కడతేరుస్తుంది. సంతోషాన్ని రెట్టింపు చేస్తుంది. ఆ బాధ్యత తీసుకున్న వ్యక్తికి సమాజంలో ఉన్నత స్థాయిలో నిలబెడుతుంది. అదే బాధ్యత కన్నీటిని తుడుస్తుంది… మా క్షేమాన్ని కోరేవారు ఉన్నారన్న భరోసాను ఇస్తుంది. అలాంటి భరోసా .. పేద కళాకారులకు ఇచ్చారు మెగాస్టార్ చిరంజీవి. కరోనా వైరస్ వ్యాప్తితో కష్టాల్లో ఉన్న సినీ కార్మికులను ఆదుకోవడానికి కరోనా క్రైసిస్ చారిటీ ఏర్పాటుకు పునాది వేసి తద్వారా వారి ఆకలి తీరుస్తున్నారు. లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న కార్మిక కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు. మా సినిమాల విజయంలో తెర వెనుకుండి కష్టపడే మీ కష్టాలను దూరం చేస్తామని హామీ ఇస్తున్నారు..

సినీ కార్మికులను ఆదుకునేందుకు సిసిసి ఏర్పాటు చేయడమే కాదు… సినీ ప్రముఖుల నుంచి విరాళాలు అందేలా స్ఫూర్తి నింపారు చిరంజీవి. దీంతో స్టార్ హీరోలు, హీరోయిన్లు, దర్శకులు, నిర్మాతలు, కమెడియన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు తమ వంతు సహాయం అందించేందుకు ముందుకొచ్చారు. దీంతో మూడు రోజుల్లోనే రూ. 6.2కోట్ల రూపాయలను సేకరించినట్లు తెలిపారు చిరు. విరాళాలు అందించిన ప్రతీ ఒక్కరికి పేరుపేరున కృతజ్ఞతలు తెలిపారు. ఎవరు ఎంత విరాళం ఇచ్చారో .. తన ట్విట్టర్ ఖాతాలో వివరాలు పెడుతూ అభినందించారు. మరింత మంది సహాయం చేసేందుకు ముందుకు రావాలని కోరారు..

Tags : Megastar, Chiranjeevi, CCC, Corona Crisis Charity, Tollywood



Next Story

Most Viewed