డర్టీ బాస్.. దంచికొట్టిన ఉద్యోగిని.. సూపర్ అంటోన్న నెటిజన్లు

by  |
డర్టీ బాస్.. దంచికొట్టిన ఉద్యోగిని.. సూపర్ అంటోన్న నెటిజన్లు
X

దిశ, వెబ్ డెస్క్ : ఒక అమ్మాయికి ఇష్టంలేకుండా ముట్టుకొనే హక్కు ఏ మగాడికి లేదు.. ముట్టుకోవద్దు అంటే ముట్టుకోవద్దు.. అది ఫ్రెండ్ అయినా, బాయ్ ఫ్రెండ్ అయినా.. మొగుడైనా.. ఏ మగాడైనా.. ఇది ‘వకీల్ సాబ్’ లోని పవర్ ఫుల్ డైలాగ్. ఈ ఒక్క డైలాగ్ తో మహిళలకు కూడా వ్యక్తిగత ఇష్టాలు ఉంటాయి అని తెలిపారు. సమాజంలో ఆడవారు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సినవి లైంగిక వేధింపులు. రోడ్డు మీద, ఆఫీసుల్లో ఎక్కడ చూసినా ఈలాంటి వేధింపులకు మహిళలు గురవుతూనే ఉన్నారు. ఎదురు తిరిగితే ఏం చేస్తారో? ఈ విషయం బయటికి తెలిస్తే బయట సమాజం ఎలా చూస్తుందో అని ఎంతోమంది మహిళలు బాధను దిగమింగుకొని బ్రతుకుతున్నారు. కానీ కొందరు మహిళలు తెగువ చూపిస్తున్నారు.. తమను వేధించినవారికి సరైన పద్దతిలో బుద్ది చెప్పి శభాష్ అనిపించుకుంటున్నారు. తాజాగా ఒక మహిళ తనను లైంగికంగా వేధించిన బాస్ తాట తీసిన ఘటన చైనా లో వెలుగు చూసింది.

చైనాకు చెందిన జౌ అనే మహిళ ఒక కంపెనీలో ఉద్యోగిగా పనిచేస్తుంది. అయితే గత నాలుగు రోజుల నుండి ఆమె బాస్ అయిన వాంగ్ నుండి ఆమెకు అభ్యంతరకర సందేశాలు రావడం మొదలయ్యాయి. ఆమె కొన్ని రోజులు మౌనంగా ఉన్నా, ఇంకా సందేశాలు రావడం ఆగలేదు. దీంతో ఆగ్రహించిన జౌ, బాస్ క్యాబిన్ లోనే అతడి తుక్కు రేగొట్టింది.

ఫ్లోర్ తుడిచే మాప్ తీసుకొని అతని క్యాబిన్ ని చిందర వందర చేసింది. దీంతో అతడు ఆ సందేశాలు కేవలం జోక్ లు అని, నవ్వుకోవడానికి పంపానని తెలుపడంతో.. అమ్మాయిల మీద జోక్ లు ఏంటని బాస్ ముఖంపై పుస్తకాలను విసిరికొట్టింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. జౌ చూపిన ధైర్యానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. మహిళలందరూ నీలా ఉంటే లైంగిక వేధింపులే ఉండవు అంటూ ప్రశంసిస్తున్నారు.


Next Story

Most Viewed