భారత్‌కు అండగా ఉంటానన్న కరోనా పుట్టినిల్లు

by  |
భారత్‌కు అండగా ఉంటానన్న కరోనా పుట్టినిల్లు
X

న్యూఢిల్లీ : ప్రపంచ మహమ్మారి కరోనా పుట్టుకకు జన్మస్థలమైన చైనా.. వైరస్‌పై పోరులో భారత్‌కు తాము అండగా ఉంటామని తెలిపింది. కరోనా ఉమ్మడి శత్రువని, దానిపై కలిసి పోరాడదామని పేర్కొంది. ఈ మేరకు వైరస్‌పై భారత్ జరుపుతున్న పోరులో తాము అండగా ఉంటామని చైనా అధ్యక్షుడు జిన్ పింగ్.. ప్రధాని మోదీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. దేశంలో కరోనా విజృంభణ కారణంగా ప్రపంచ దేశాలు భారత్‌ను ఆదుకుంటున్న నేపథ్యంలో చైనా స్పందించింది. ‘సానుభూతి పూర్వకం’గా రాసిన ఈ లేఖలో జిన్ పింగ్.. ‘కరోనా వైరస్ మానవజాతికి ఉమ్మడి శత్రువు. ఈ మహమ్మారిని ఎదుర్కోవడంలో మేం మా వంతు సాయం అందజేయడానికి సిద్ధంగా ఉన్నాం..’ అని పేర్కొన్నారు. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ ఈ సైతం భారత్‌లోని పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన భారత విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి ఎస్. జైశంకర్‌కు రాసిన లేఖలో.. చైనాలో తయారైన యాంటీ పాండమిక్ మెటీరియల్స్ త్వరలోనే భారత్‌కు చేరుతాయని తెలిపారు. ఇదిలాఉండగా.. భారత్‌లో కరోనా మహమ్మారి పరిస్థితిని అలుసుగా తీసుకుని లడాఖ్ తూర్పు ప్రాంతంలో చైనా మళ్లీ తన బలగాలను మొహరిస్తున్నదని శుక్రవారం వార్తలు వెలువడటం గమనార్హం.


Next Story