చైనాను దారికి తీసుకొస్తాం -బైడెన్

by  |
చైనాను దారికి తీసుకొస్తాం -బైడెన్
X

వాషింగ్టన్: అమెరికా, చైనా మధ్య వాణిజ్య సంబంధాలు దిగజారిన తరుణంలో అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. చైనాను దారికి తీసుకురావాలని కంకణం కట్టుకున్నట్టు తెలిపారు. చైనాను శిక్షించడం కాదు, నిబంధనలకు లోబడి నడుచునేలా చేయాలని భావిస్తున్నట్టు వివరించారు. అలాగే, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో)లో మళ్లీ చేరతారని స్పష్టం చేశారు.

ప్రెసిడెన్షియల్ డిబేట్‌లో బైడెన్ చేసిన వ్యాఖ్యలను గుర్తుచేస్తూ చైనాపై ఆర్థిక ఆంక్షలు విధించనున్నారా అని అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ… డ్రాగన్ కంట్రీని శిక్షించాలని భావించడం లేదని, నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని ఆ దేశానికి గుర్తుచేయాలనుకుంటున్నట్టు తెలిపారు. ఇదొక చిన్న ప్రతిపాదన అంతేనని వివరించారు. డబ్ల్యూహెచ్‌వో తోపాటు పారిస్ ఒప్పందంలోనూ తిరిగి చేరతామని, చైనాను దారికి తీసుకురావాలనే ఉద్దేశ్యమూ ఇందులో ఉన్నదని చెప్పారు. ప్రపంచ దేశాలతో తాము కలిసి నడవాలని, తాను నడవాల్సిన మార్గమూ చైనాకు ఉన్నదని, అందులోనే ముందుకెళ్లాల్సి ఉంటుందని అర్థం చేయిస్తామని తెలిపారు.

Next Story

Most Viewed