డబ్ల్యూహెచ్‌వోను చైనా బెదిరించిందా..?

by  |
డబ్ల్యూహెచ్‌వోను చైనా బెదిరించిందా..?
X

వాషింగ్టన్: ప్రపంచ ఆరోగ్యం సంస్థ (డబ్ల్యూహెచ్‌వో)ను చైనా బెదిరించిందా..? హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటిస్తే నిధులు నిలిపేస్తామని హెచ్చరించిందా అంటే అవుననే అంటున్నాయి అమెరికా నిఘా సంస్థలు. చైనాలోని వూహాన్‌లో వైరస్ పుట్టిన తర్వాత అది మనుషుల నుంచి మనుషులకు సంక్రమిస్తోందని డబ్ల్యూహెచ్‌వోకు చైనా జనవరి 20న తెలిపింది. అప్పటికే ఇతర దేశాల్లో కూడా వైరస్ వేగంగా ప్రబలుతున్నట్లు గుర్తించింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని డబ్ల్యూహెచ్‌వో భావించిందని.. కానీ చైనా ఆ సంస్థను బెదిరించినట్లు అమెరికా నిఘా సంస్థ సీఐఏ స్పష్టం చేసింది. హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటిస్తే చైనా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుందనే భయంతోనే ఇలాంటి హెచ్చరికలు చేసిందని.. డబ్ల్యూహెచ్‌వో కనుక తమ మాట వినకపోతే నిధులు ఆపేయడంతో పాటు తమ సహకారాన్ని కూడా ఉపసంహరిస్తామని చెప్పినట్లు సీఐఏ నివేదికలో బయటపెట్టింది. చైనాలో కరోనా కేసులు 80 వేల కు చేరినప్పుడు డబ్ల్యూహెచ్‌వో, చైనా మధ్య ఈ మాటలు నడిచినట్లు చెప్పుకొచ్చింది. ఈ తాజా నివేదికను ‘న్యూస్ వీక్’ ఒక కథనంలో ప్రచురించింది. దీంతో చేసేదేమీ లేక డబ్ల్యూహెచ్‌వో కరోనా వైరస్‌పై స్వతంత్రంగానే వ్యవహరించాల్సి వచ్చింది. కానీ ప్రపంచ దేశాలను కరోనా కబలించేస్తుండటంతో చివరకు ప్రపంచ ఆరోగ్యం సంస్థ కరోనాను మహమ్మారిగా ప్రకటించింది. మరి ఈ కథనంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎలా స్పందిస్తుందో చూడాలి.

Next Story

Most Viewed