బుల్లి కమిషనర్ సాదిఖ్ మృతి

by  |
బుల్లి కమిషనర్ సాదిఖ్ మృతి
X

దిశ, క్రైమ్ బ్యూరో : పదేళ్ల వయస్సులోనే హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్‌గా విధులు నిర్వర్తించిన సాదిఖ్ కన్నుమూశారు. కరీంనగర్ జిల్లా రేకుర్తి గ్రామానికి చెందిన సాదిఖ్‌కు పోలీస్ కావాలనే కోరిక ఉండేది. కానీ, పదేళ్ల వయస్సుకే బ్లడ్ క్యాన్సర్ (లుకేమియా) రావడంతో పోలీస్ కావాలన్న తన కలను నేరవేర్చుకోలేకపోతున్నట్టు బాధపడుతుండగా.. మేక్ ఏ విష్ ఫౌండేషన్ సాదిఖ్‌ను పరామర్శించింది. సాదిఖ్ కలను నేరవేర్చేందుకు మేక్ ఏ విష్ ఫౌండేషన్ కృషి చేసింది.

ఈ విషయాన్ని నాటి హైదరాబాద్ సీపీ, నేటి డీజీపీ మహేందర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా.. సాదిఖ్‌ను ఒకరోజు కమిషనర్ చేసేందుకు అంగీకరించారు. ఈ సందర్భంగా 2014 అక్టోబరు 15న సాదిఖ్ హైదరాబాద్ నగరానికి ఒకరోజు సీపీగా విధులు నిర్వర్తించాడు. ప్రస్తుతం సాదిఖ్ వయస్సు 17 సంవత్సరాలు కాగా.. అప్పట్నుంచి ఆ వ్యాధితో బాధపడుతున్న సాదిఖ్ తన స్వగ్రామం కరీంనగర్ జిల్లా రేకుర్తి గ్రామంలో బుధవారం మరణించాడు.

తన కుమారుడిని కాపాడేందుకు డాక్టర్లు చాల వరకూ కృషి చేశారని సాదిఖ్ తండ్రి జావేద్ తెలిపారు. ఒకరోజు కమిషనర్‌గా పనిచేసేందుకు అవకాశం కల్పించిన ఆనాటి సీపీ, నేటి డీజీపీ మహేందర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.


Download Dishadaily Android APP

Download Dishadaily IOS APP



Next Story

Most Viewed