మాకు బ్రాండ్స్ వద్దు..చీప్‌ లిక్కరే కావాలంటున్న మందుబాబులు

by  |
మాకు బ్రాండ్స్ వద్దు..చీప్‌ లిక్కరే కావాలంటున్న మందుబాబులు
X

రాష్ట్రంలో ఇకమీదట దేని గురించి అయినా మాట్లాడాలంటే కరోనాకు ముందు, ఆ తర్వాత అనే చెప్పుకోవాల్సి వచ్చేలా ఉంది. దానికి కారణం తెలంగాణలో ప్రతి సంవత్సరం మద్యం అమ్మకాలు ఘననీయంగా పెరగుతూనే ఉన్నాయి. దానికి ప్రభుత్వం తీసుకుంటున్న చొరవ లేదా మందు బాబులు పెరిగారా? కారణాలు అనేకం కావొచ్చు.అయితే ప్రస్తుతం పరిస్థితి పూర్తి భిన్నంగా మారిపోయింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా మద్యం అమ్మకాలు పడిపోతున్నాయి.కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు లాక్‌డౌన్ ఆంక్షలు సడలించాక ప్రభుత్వం మద్యం షాపులను తెరించేందుకు అనుమతులిచ్చింది. జీహెచ్ ఎంసీ పరిధిలో మొదటి వారం రోజుల్లో సుమారు రూ.800 కోట్ల వ్యాపారం జరిగింది. ఈ నెల 6న మద్యం షాపులు తెరుచుకున్న తొలిరోజే రూ.150 కోట్ల వ్యాపారం సాగగా, ప్రభుత్వానికి ఆదాయం భారీగానే వస్తుందని అధికారులు భావించారు.కానీ, ఇక్కడే సీన్ రీవర్స్ అయింది. మరుసటి రోజు అమ్మకాలు క్రమంగా తగ్గుతూ వచ్చాయి.గతేడాది మే నెలతో పోలిస్తే దాదాపు 25 శాతం అమ్మకాలు తగ్గినట్టు తెలుస్తోంది. లాక్‌డౌన్‌ సడలింపులతో తొలి వారంలో రూ.1500 కోట్ల వ్యాపారం అవుతుందని భావించిన అధికార యంత్రాంగం సగంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దీనికి ధరల పెంపుదల, లేదా బ్లాక్ మార్కెట్ పెరగడం ఇలా రకరకాల కారణాలు వినిపిస్తున్నాయి. కొంత మంది డీలర్లు ధరల పట్టిక సైతం ప్రదర్శించకుండా ఎక్కువ ధరలకు విక్రయిస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే సామాన్య, మధ్యతరగతి మందు బాబులు బ్రాండెడ్‌ మద్యం కన్నా చీప్‌ లిక్కర్‌ కొనుగోలుకే ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు. హైదరాబాద్‌లో రోజువారీ జరిగే అమ్మకాల్లో చీప్ లిక్కర్లే ఎక్కువగా అమ్ముడు పోతున్నట్టు అధికారులు కూడా స్పష్టంచేశారు. లాక్‌డౌన్ వలన మందుబాబులకు వచ్చిన గ్యాప్, పెంచిన ధరలతో అధిక రెవెన్యూ వస్తుందని ఆశలు పెట్టుకున్న ప్రభుత్వానికి నిజంగానే మద్యం ప్రియులు షాక్ ఇచ్చారు.

Next Story

Most Viewed