Charlie Bit My Finger : రూ. 5.5 కోట్లకు అమ్ముడుపోయిన యూట్యూబ్ వైరల్ వీడియో

by  |
Charlie Bit My Finger : రూ. 5.5 కోట్లకు అమ్ముడుపోయిన యూట్యూబ్ వైరల్ వీడియో
X

దిశ, ఫీచర్స్ : చిన్నారుల ఫన్నీ వీడియోలు భలే సరదాగా ఉంటాయి. వాటిని పిల్లలే కాదు, పెద్దొళ్లు కూడా చూస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. ఈ క్రమంలోనే ఇంగ్లాండ్‌కు చెందిన ఇద్దరు పిల్లల వీడియో ‘చార్లీ బిట్ మై ఫింగర్’ (Charlie Bit My Finger )యూట్యూబ్‌లో ఇప్పటికే 900 మిలియన్ల వీక్షణలు పొంది మరింత ముందుకు దూసుకుపోతుంది. ఆ వీడియోలో చార్లీ డేవిస్ కార్ అనే బుడ్డోడు, తన పెద్ద సోదరుడు హ్యారీ డేవిస్ కార్ వేలిని కొరుకి నవ్వుతాడు. దాంతో మరోసారి వేలు పెట్టడంతో ఇంకా గట్టిగా కొరుకుతాడు. చిన్నోడు నవ్వులతో మురిసిపోతే, పెద్డోడు కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఆ తర్వాత ఇద్దరూ హ్యాపీగా నవ్వేస్తారు. ఈ వీడియో నాన్ ఫంజిబుల్ టోకెన్‌గా 760,999 డాలర్లకు విక్రయించడం విశేషం.

ప్రసిద్ధ ‘చార్లీ బిట్ మై ఫింగర్’ (Charlie Bit My Finger )వీడియో యూట్యూబ్‌లోని అత్యంత వైరల్ క్లిప్‌లలో ఒకటి. దీన్ని 2007లో అప్‌లోడ్ అయిన ఈ వీడియోకి ఇప్పటికే అనేక డూప్లికేట్ వీడియోలు కూడా ఆన్‌లైన్‌లోనే ఉన్నాయి. అనేక మధురక్షణాలను అందించే బాల్యంలో ప్రతీది అద్భుతమే. చిన్నారులు ఫన్నీ మూమెంట్స్‌ను క్యాప్చర్ చేసేందుకు ప్రతీ పేరెంట్ ఎంతో శ్రద్ధ తీసుకుంటాడు. హ్యారీ, చార్లీల పేరెంట్స్ కూడా ఇద్దరు కుర్రాళ్ళు పెరుగుతున్నప్పుడు ర్యాండమ్ మూమెంట్స్‌ను పట్టుకోవడంలో భాగంగా దీన్ని చిత్రీకరించినట్లు పేర్కొన్నారు. స్నేహితులు, కుటుంబ సభ్యులు చూడటానికి మాత్రమే వారు దీన్ని యూట్యూబ్‌లో పోస్ట్ చేసినప్పటికీ, ఈ వీడియో అనూహ్యంగా వైరల్ అయింది.

ఇప్పుడు ఈ వీడియోను వారికి $ 7,60,999 (సుమారు రూ .5.54 కోట్లు) సంపాదించి పెట్టింది. నాన్-ఫంజిబుల్ టోకెన్ (ఎన్‌ఎఫ్‌టి)గా విక్రయించే వేలంలో కనీసం 11 దేశాలకు చెందిన వ్యక్తులు ఈ వేలంలో పాల్గొనగా, ఇద్దరు అనామక బిడ్డర్లు తీవ్రంగా పోటీపడ్డారు. చివరికి 760,999 డాలర్ల వద్ద వేలం ముగిసింది. ఎన్‌ఎఫ్‌టిలు ప్రత్యేకమైన డిజిటల్ ఆస్తులు. బ్లాక్‌చైన్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఒక వ్యక్తి కొనుగోలు చేయవచ్చు లేదా అమ్మవచ్చు. అయితే NFT కొనుగోలుదారులు సాధారణంగా కాపీరైట్‌లు, ట్రేడ్‌మార్క్‌లు లేదా వారు కొనుగోలు చేసిన వాటి యాజమాన్యాన్ని పొందకపోవడం గమనార్హం. ప్రస్తుతం ఈ వీడియోను యూట్యూబ్ నుంచి తొలగించారు.

అంతకుముందు మార్చిలో, ట్విట్టర్ సీఈఓ జాక్ డోర్సే తన మొట్టమొదటి ట్వీట్‌ను ఎన్‌ఎఫ్‌టిగా అమ్మకానికి పెట్టిన విషయం తెలిసిందే. ఈ ట్వీట్‌ను 2.9 మిలియన్ల డాలర్లకు (సుమారు రూ. 210,027,280) నాన్‌ ఫంగబుల్ టోకెన్‌గా విక్రయించారు.

Next Story

Most Viewed