గుడి గేట్లు ధ్వంసం : 50 మంది అరెస్టు

43

దిశ, వెబ్ డెస్క్: కర్ణాటకలో అవాంఛనీయ ఘటన జరిగింది. ఓ ఆలయంలో పూజల నిర్వహణకు కొద్దిమందికే అనుమతి ఉండగా, వందల సంఖ్యలో భక్తులు గుమిగూడారు. అనంతరం గుడి గేట్లు ధ్వంసం చేశారు. అనుమతి లేకున్నా రథయాత్ర నిర్వహించడానికి యత్నించారు. ఈ కేసులో సుమారు 50 మందిని అరెస్టు చేసినట్టు పోలీసులు వివరించారు. డీఎస్పీ సంగీత అందించిన వివరాల ప్రకారం, దొతిహాల్ గ్రామంలో ప్రతియేటా నిర్వహించే పూజలకు కొద్దిమందికి మాత్రమే తహశీల్దార్ అనుమతినిచ్చారు.

లాక్‌డౌన్ కారణంగా తక్కువమందితోనే గుడి లోపల పూజలు జరుగుతుండగా, బయట సుమారు 50 మంది గుమిగూడటంతో ఓ మెటల్ గ్రిల్‌ను గేటులాగా అడ్డం పెట్టారు. కానీ, బయట మంది పెరిగారు. నిషేధాజ్ఞలున్నప్పటికీ గేట్లను ధ్వంసం చేసి రథయాత్రను నిర్వహించడానికి యత్నించారు. పరిస్థితులను అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు లాఠీ చార్జీచేయాల్సి వచ్చింది. చాలా మంది గ్రామస్తులు పారిపోయారు. సీసీటీవీ ఫుటేజీ సహకారంతో 50 మంది నిందితులను అరెస్టుచేశారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..