షాక్ అయ్యాను: చంద్రబాబు

by  |
షాక్ అయ్యాను: చంద్రబాబు
X

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్ కారణంగా 45 రోజుల తరువాత ఆంధ్రప్రదేశ్‌లో మద్యం దుకాణాలు తెరిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ షాపుల ముందు మందుబాబులు కిలోమీటర్ల మేర క్యూలు కట్టడం, భౌతిక దూరం పాటించకపోవడం పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన పలు వీడియోలను ఆయన తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేస్తూ…

‘ఆంధ్రప్రదేశ్‌లో మద్యం దుకాణాల ముందు ఈ దృశ్యాలను చూసి షాకయ్యాను. మద్యం షాపుల ముందు మద్యం ప్రియులు భారీగా చేరుకునే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ జగన్‌ ముందస్తు ప్రణాళికలు వేసుకోలేదు. సామాజిక దూరం నిబంధనలు పాటించాలన్న జాగ్రత్తలు తీసుకోలేదు. ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభిస్తోన్న నేపథ్యంలోనూ ఇటువంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి’ అంటూ ఆయన మండిపడ్డారు.

tags: tdp, chandrababu naidu, liquor shops, ysrcp, ap government

Next Story

Most Viewed