ఆంక్షలు దిశగా రాష్ట్రాలు.. ఇప్పుడు చండీగఢ్ వంతు

by  |
ఆంక్షలు దిశగా రాష్ట్రాలు.. ఇప్పుడు చండీగఢ్ వంతు
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా తీవ్రత మళ్లీ పెరుగుతుండటంతో.. పలు రాష్ట్రాలు ఆంక్షల దిశగా అడుగులు వేస్తున్నాయి. కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో లాక్‌డౌన్ విధిస్తున్నాయి. ఇప్పటికే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఢిల్లీ లాంటి రాష్ట్రాలు కరోనా ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో లాక్‌డౌన్ విధించాయి. మరికొన్ని ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించాయి.

ఈ క్రమంలో చండీగఢ్ ప్రభుత్వం కూడా అదే బాటలో నడుస్తోంది. కరోనా తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా పలు ఆంక్షలు విధించింది. రెస్టారెంట్లు, ఆహార ప్రదేశాలు రాత్రి 11 గంటలకు మూసివేయాలని ఆదేశించింది. హోలీ సందర్భంగా.. పబ్లిక్‌గా అందరూ కలవడంపై నిషేధం విధించింది. క్లబ్స్, హోటల్స్, రెస్టారెంట్లలో ఎలాంటి మీటింగ్స్‌కు అనుమతి లేదంది.

స్టేట్ మ్యూజియంలు, లైబ్రరీలు, ఆడిటోరియంలు, థియేటర్స్ తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు మూసివేసి ఉంటాయని చండీగఢ్ ప్రభుత్వం తెలిపింది. రెస్టారెంట్లు, మాల్స్‌ను 50 శాతం కెపాసిటీతో మాత్రమే నడిపించాలని ఆదేశించింది.

Next Story

Most Viewed