సీఎం జగన్‌కు కేంద్రమంత్రి అథవాలే భారీ ఆఫర్.. కలిసుంటేనే రాష్ట్రాభివృద్ధి!

by  |
సీఎం జగన్‌కు కేంద్రమంత్రి అథవాలే భారీ ఆఫర్.. కలిసుంటేనే రాష్ట్రాభివృద్ధి!
X

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీ ప్రభుత్వంపై కేంద్రమంత్రి రాందాస్ అథవాలే కీలకవ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి జగన్ తనకు మంచి మిత్రుడు అని.. వైసీపీ పార్టీ NDA కూటమిలో చేరితే కలిసి పని చేద్దామని తెలిపారు. ఎన్డీయేలో చేరితే హైవేలు, నీటిపారుదల ప్రాజెక్టుల్లో ఏపీకి మేలు జరుగుతుందని పరోక్షంగా ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇకపోతే మూడు రాజధానుల అంశం రాష్ట్రం పరిధిలోకి వస్తుందని కేంద్రమంత్రి స్పష్టంచేశారు.

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణతో ఎస్టీ, ఎస్టీ రిజర్వేషన్లుకు విఘాతం కలుగుతుందని.. అందుకోసం సత్వర చర్యలు తీసుకుంటామన్నారు. మరో 15 ఏండ్ల వరకు కాంగ్రెస్ పార్టీ కోలుకునే పరిస్థితి లేదని వివరించారు. పరిశ్రమల ప్రైవేటీకరణ అనేది అధికంగా కాంగ్రెస్ పార్టీ హయాంలోనే జరిగిందన్నారు. కేంద్ర మంత్రి వ్యాఖ్యలు, ఆఫర్‌పై సీఎం జగన్ ఎలా స్పందిస్తారోనని ఏపీ పాలిటిక్స్‌లో జోరుగా చర్చ నడుస్తోంది.



Next Story