- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
కఠిన ఆంక్షలు అమలు చేయాలి… ఒమిక్రాన్‌పై కేంద్రం కీలక ఆదేశాలు

X
దిశ, వెబ్‌డెస్క్: దేశంలో ఒమిక్రాన్ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. రాష్ట్రాలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూనే ఉంది. అవసరమైతే నైట్ కర్ఫ్యూ విధించాలని ఇప్పటికే స్పష్టం చేసిన కేంద్రం.. కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఆంక్షలు విధించాలని సూచించింది. ఈ క్రమంలో తాజాగా రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రం లేఖలు రాసింది.
ఒమిక్రాన్ కట్టడికి డైనమిక్‌గా నిర్ణయాలు తీసుకోవాలని సూచించింది. వెంటనే వార్ రూమ్ లు ఏర్పాటు చేసుకోవాలని, సత్వర కఠిన నిర్ణయాలకు సిద్ధంగా ఉండాలని తెలిపింది. డెల్టా కంటే ఒమిక్రాన్ మూడురెట్లు అధికంగా వ్యాప్తి చెందుతోందని వెల్లడించింది. కేసుల సంఖ్య పెరిగితే కంటైన్ మెంట్ జోన్లు, రాత్రి కర్ఫ్యూలు వంటి కఠిన ఆంక్షలు అమలు చేయాలని సూచించింది.
Next Story