విమానయాన సంస్థలపై కేంద్రం సీరియస్

by  |
విమానయాన సంస్థలపై కేంద్రం సీరియస్
X

న్యూఢిల్లీ: విమానయాన సంస్థలపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయింది. లాక్‌డౌన్‌ను వచ్చే నెల 3వరకు పొడిగించిన నేపథ్యంలో, ముందస్తుగా విమాన టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులకు డబ్బులు తిరిగి చెల్లించలేమనీ, ఆ డబ్బును తర్వాతి ప్రయాణాలకు ఉపయోగించుకోవాలని సూచించాయి. అయితే, ఈ నిర్ణయంపై ప్రయాణికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. సోషల్ మీడియా ద్వారా కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వశాఖకు ఫిర్యాదు చేశారు. దీంతో కేంద్రం స్పందిస్తూ.. అడ్వాన్స్ టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులకు గరిష్టంగా మూడు వారాల్లో మొత్తం చార్జీలను రీఫండ్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అలాగే, ఏప్రిల్ 15 నుంచి మే 3వరకు బుక్ చేసుకున్న టికెట్లకూ ఈ ఆదేశాలు వర్తిస్తాయని స్పష్టం చేసింది.

Tags: lockdown, airlines, advance booking, central govt, refund

Next Story