- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
చనిపోయిన రైతులకు పరిహారం ఇవ్వము.. తేల్చి చెప్పిన కేంద్రం
by Anukaran |

X
దిశ, వెబ్‌డెస్క్: కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీలో జరిగిన ఉద్యమంలో పలువురు రైతులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఇలా మరణించిన రైతులకు ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కొక్కరికి రూ. 3 లక్షల చొప్పు పరిహారం అందిస్తామని ప్రకటించారు ఇక ఇదే విషయంపై కేంద్ర ప్రభుత్వం స్పందిస్తూ.. ఉద్యమంలో చనిపోయిన రైతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వలేమని పార్లమెంట్ సమావేశాల్లో తేల్చిచెప్పింది. కనీసం మరణించిన రైతుల రికార్డులు కూడా తమ వద్ద లేవని చెప్పింది. ఈ నేపథ్యంలోనే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి తోమర్ పరిహారం ఇవ్వలేమని లిఖిత పూర్వకంగా సమాధానం ఇవ్వడం గమనార్హం. ప్రస్తుతం ఈ వ్యవహారంపై రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Next Story