సెకండ్ వేవ్ నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం

by  |
సెకండ్ వేవ్ నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కరోనా సెకండ్ వేవ్ విలయ తాండవం సృష్టిస్తున్న క్రమంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కంటైన్‌మెంట్ నిబంధనల గడువును పొడిగిస్తూ కేంద్ర హోంశాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 25న కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ జారీ చేసిన నిబంధనలను అమలు చేయాల్సిందేనని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. మే 31 వరకు కంటైన్‌మెంట్ నిబంధనలు అమల్లోకి ఉంటాయ తెలిపింది.

ఈ మార్గదర్శకాలు అన్ని రాష్ట్రాలకు వర్తిస్తాయని కేంద్రం స్పష్టం చేసింది. 10 శాతం కంటే ఎక్కువ పాజిటివిటీ రేట్ ఉన్న ప్రాంతాలను గుర్తించి కఠిన కంటైన్‌మెంట్ నిబంధనలు అమలు చేయాలని పేర్కొంది.

Next Story

Most Viewed