ఎరువు కర్మాగారాల పునరుద్ధరణ .. లోక్‌సభలో కేంద్రం క్లారిటీ

by  |
ఎరువు కర్మాగారాల పునరుద్ధరణ .. లోక్‌సభలో కేంద్రం క్లారిటీ
X

దిశ, ఏపీ బ్యూరో: భారతదేశంలో మూతపడిన 5 (ఎఫ్.సి. ఐ.ఎల్) ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్, (హెచ్.ఎఫ్.సి. ఎల్) హిందుస్థాన్ ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ లిమిటెడ్, ఎరువు కర్మాగారాల పునరుద్ధరణపై నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి కేంద్రాన్ని ప్రశ్నించారు. ఎరువు కర్మాగారాల పునరుద్ధరణ పురోగతిపై వివరణ ఇవ్వాలని లోక్‌సభలో శుక్రవారం ప్రశ్నించారు. ఈ కర్మాగారాల్లో సాంకేతికత, నిర్వహణ కోసం కేటాయించిన నిధులు, నిరంతర విద్యుత్ సరఫరాకు క్యాప్టివ్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేశారా? లేదా? అని ప్రశ్నించారు. ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖమంత్రి డా. మన్సుఖ్ మాండవీయ లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు.

మూతపడిన ఐదు కర్మాగారాల్లో ఇప్పటికే రెండు ప్రారంభమైనట్లు స్పష్టం చేశారు. తెలంగాణలోని రామగుండం కర్మాగారం ఈ ఏడాది మార్చి 22న, ఉత్తరప్రదేశ్ లోని గోరక్ పూర్ లో హిందుస్థాన్ ఊర్వర్క్ రసాయన్ ఈనెల 7న ప్రారంభమైనట్లు తెలిపారు. అలాగే జార్ఖండ్‌లోని సింద్రీ కర్మాగారం 93 శాతం, బీహార్‌లోని బరవుని హిందుస్థాన్ ఊర్వర్క్ రసాయన్ కర్మాగారం 92 శాతం, ఒడిశాలోని తాల్చర్ కర్మాగారం 17 శాతం పూర్తైనట్లు తెలిపారు. ప్రస్తుతం సాంకేతికత, పెంపుదల నిర్వహణ ప్రతిపాదనేదీ లేదని స్పష్టం చేశారు. అలాగే రామగుండం, గోరక్ పూర్, సింద్రీ, బరవుని ప్లాంట్లలో క్యాప్టివ్ పవర్ ప్లాంట్లను సైతం ఏర్పాటు చేసినట్లు కేంద్రమంత్రి వివరణ ఇచ్చారు.



Next Story

Most Viewed