కరోనా కట్టడిపై కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి సమావేశం

by  |
కరోనా కట్టడిపై కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి సమావేశం
X

దిశ, న్యూస్ బ్యూరో:
తెలంగాణతో పాటు మరో ఎనిమిది రాష్ట్రాల్లో కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలపై కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి సమీక్ష నిర్వహించారు. శుక్రవారం ఢిల్లీ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో తెలంగాణతో పాటు బీహార్, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్, తమిళనాడు, కర్నాటక తదితర మొత్తం తొమ్మిది రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు. ప్రస్తుతం చేస్తున్న కరోనా నిర్ధారణ పరీక్షలు, పాజిటివిటీ రేటు, అందుబాటులో ఉన్న టెస్టింగ్ కిట్లు, ప్రైవేటు ల్యాబుల్లో జరుగుతున్నటెస్టులు, ఆస్పత్రుల్లో లభిస్తున్న చికిత్స, కరోనా కారణంగా చనిపోతున్నవారి సంఖ్య, ప్రస్తుతం ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న యాక్టివ్ పేషెంట్లు, ఇళ్ళల్లోనే హోమ్ ఐసొలేషన్‌లో ఉన్నవారికి ప్రభుత్వం తరఫున లభిస్తున్న వైద్య సేవలు తదితరాలన్నింటిపైనా ఆయన ఆరా తీశారు.

తెలంగాణ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌తో పాటు వైద్యారోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ కూడా ఈ సమావేశంలో పాల్గొని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. హైదరాబాద్ నగరంతో పాటు వైరస్ తీవ్రత ఎక్కువ ఉన్న జిల్లాల్లో అనుసరిస్తున్న వ్యూహాన్ని కట్టడి చేయడానికి అవలంభిస్తున్న చర్యలను వివరించినట్లు ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది.



Next Story

Most Viewed