ప్రధాని మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీ.. లాక్‌డౌన్‌పై కీలక నిర్ణయం..?

by Shamantha N |
ప్రధాని మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీ.. లాక్‌డౌన్‌పై కీలక నిర్ణయం..?
X

దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో నెలకొన్న అత్యయిక పరిస్థితులపై ప్రధాని మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ శుక్రవారం సమావేశం కానుంది. ఈ భేటీలో దేశవ్యాప్తంగా కర్ఫ్యూ లేదా లాక్‌డౌన్‌పై కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలుమార్లు మోడీ అధ్యక్షతన సమావేశం నిర్వహించగా, వ్యాక్సినేషన్ సామర్థ్యం పెంపు, ఆక్సిజన్ సరఫరా గురించి మాత్రమే చర్చకు వచ్చింది. దేశంలో రోజువారీగా మూడు లక్షలకు పైగా కేసులు నమోదవుతుండటంతో పాటు మరణాల సంఖ్య కూడా మూడు వేలకు పైగా దాటింది. ఓ వైపు రాష్ట్రాలు వ్యాక్సినేషన్, ఆక్సిజన్ కొరతను తీవ్రంగా ఎదుర్కొంటుండగా, మరోవైపు ఆస్పత్రుల్లో బెడ్స్, శ్మశనాల్లో మృతదేహాలను దహనం చేయడానికి కూడా స్థలం దొరకడం లేదు. ఈ నేపథ్యంలోనే రేపు మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.Next Story

Most Viewed