- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఫిలిం ఛాంబర్‌లో సిరివెన్నెల పార్థివదేహాం.. ప్రముఖుల నివాళులు

దిశ, వెబ్‌డెస్క్ : ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి(66) అనారోగ్యంతో మంగళవారం తుదిశ్వాస విడిచారు. అయితే, అభిమానుల సందర్శనార్థం ఆయన భౌతికకాయాన్ని బుధవారం ఉదయం ఫిలింనగర్‌లోని ఫిలిం ఛాంబర్‌కు తీసుకువచ్చారు. పార్థివదేహాన్ని 10.30 గంటల వరకు అక్కడే ఉంచి.. ఉదయం 11 గంటలకు మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు.
సిరివెన్నెల భౌతిక కాయాన్ని చూసిన అనంతరం నటుడు తనికెళ్ల భరణి తీవ్ర ఉద్వేగానికి గురయ్యారు. ఆయనతో కలిసి పనిచేసిన రోజులను గుర్తుకు తెచ్చుకొని కన్నీటి పర్యంతమయ్యారు.
కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కీ.. సీతారామశాస్త్రికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సిరివెన్నెల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సీతారామశాస్త్రి ఆకస్మిక మరణం సినీ రంగానికి, తెలుగు సాహిత్యానికి తీరని లోటు అని అన్నారు.
అలాగే, నటుడు బాలకృష్ణ, చిరంజీవి, అల్లు అర్జున్, వెంకటేశ్, దర్శకుడు త్రివిక్రమ్, సంగీత దర్శకుడు మణిశర్మ, గుణశేఖర్, సునీత, పరుచూరి గోపాలకృష్ణ, స్రవంతి రవికిషోర్, అచ్చిరెడ్డి, ఎస్వీ కృష్ణారెడ్డి, సాయికుమార్ తదితరులు సిరివెన్నెల భౌతికకాయానికి నివాళులు అర్పించారు.