సీఎం జగన్ కిక్కిచ్చే న్యూస్.. షాపుల వద్ద మందుబాబుల చిందులు(వీడియో)

by  |
సీఎం జగన్ కిక్కిచ్చే న్యూస్..  షాపుల వద్ద మందుబాబుల చిందులు(వీడియో)
X

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో మందుబాబుల సంబురాలు అంబరాన్నంటుతున్నాయి. వైసీపీ ప్రభుత్వం శనివారం వ్యాట్, అదనపు ఎక్సైజ్‌ డ్యూటీ ప్రత్యేక మార్జిన్‌లో హేతుబద్ధతను తీసుకొచ్చింది. దీంతో మద్యం ధరలు తగ్గుముఖం పట్టాయి. ఆదివారం మధ్యాహ్నాం నుంచి రాష్ట్రంలో మద్యం ధరలు తగ్గాయి. దీంతో మందుబాబులు దుకాణాల దగ్గర సందడి చేశారు. గత కొన్ని రోజులుగా కొండెక్కి కూర్చున్న రేట్లు ఒక్కసారిగా తగ్గడంతో మందుబాబుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. దీంతో మద్యం దుకాణాల దగ్గర చిందులేశారు. అంతేకాదు ప్రకాశం జిల్లాలో అయితే మద్యం షాపులకు వచ్చి ఏకంగా హారతులు పట్టారు. అక్కడితో ఆగిపోలేదు.. కొబ్బరికాయలు కొట్టి పాటలు పాడుతూ కిక్ ఇచ్చేలా ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చారు.

ఫ్లాష్.. ఫ్లాష్.. వైసీపీ నేతపై ఎటాక్.. చితక్కొట్టిన సొంత పార్టీ నేత(వీడియో)

ఇకపోతే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మద్యపాన నిషేధం చేస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చీరాగానే మద్యం పాలసీని మార్చేసింది. ప్రభుత్వ మద్యం దుకాణాలను ప్రవేశపెట్టింది. ఎక్కడాలేని బ్రాండ్లను తీసుకువచ్చింది. ధరలను పెంచేసింది. కొన్ని మద్యం దుకాణాలను తగ్గించిన జగన్ సర్కార్.. ఆ తర్వాత మందుబాబులకు షాక్ కొట్టేలా రేట్లు పెంచారు. లాక్‌డౌన్‌ తర్వాత కూడా మద్యం ధరలను పెంచేసింది. లిక్కర్‌ జోలికి వెళ్లకుండా ఉండాలంటే రేట్లు పెంచడమే సరైన మార్గమని వైసీపీ ప్రభుత్వం చెప్పుకొచ్చింది. దీంతో ఏపీలో మద్యం తాగాలంటే చాలా కష్టంగా మారింది. దీంతో కొందరు పొరుగు రాష్ట్రాల నుంచి మద్యం తరలించే ప్రయత్నాల్లో ఆరితేరిపోయారు. ఇంకొందరు అయితే నాటు సారా బాటపట్టారు.

పొరుగు రాష్ట్రాల నుంచి చీప్‌లిక్కర్‌తోపాటు ఇతర బ్రాండ్ల అక్రమ రవాణా జరుగుతుండటంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడుతుందనే ఆలోచనకు వచ్చింది ప్రభుత్వం. దీంతో ఉన్నట్లు ఉండి విక్రయాల జోరు పెంచేందుకు శనివారం వ్యాట్, అదనపు ఎక్సైజ్‌ డ్యూటీ ప్రత్యేక మార్జిన్‌లో హేతుబద్ధతను తీసుకొచ్చింది. ఈ నిర్ణయంతో లిక్కర్ ధరలు తాజాగా 15- 20 శాతం తగ్గాయి. బ్రాండ్‌ను బట్టి క్వార్టర్‌పై కనీసం 20 నుంచి 50 వరకూ, ఫుల్‌ బాటిల్‌పై 120 నుంచి 200 వరకూ తగ్గుదల వర్తింపజేసింది. అన్ని రకాల బీర్లపై 20 నుంచి 30 వరకు ధర తగ్గింది. చీప్‌లిక్కర్‌ బ్రాండ్లపై అధికంగా, ప్రీమియం బ్రాండ్లపై తక్కువగా ధరలు తగ్గాయి. చీప్‌ లిక్కర్‌ రేట్లు గణనీయంగా తగ్గటంతో.. వినియోగం మరింత పెరిగి.. ప్రభుత్వానికి భారీగా ఆదాయం లభించవచ్చని ప్రభుత్వం అంచనాలు వేసినట్లు తెలుస్తోంది.

Next Story