ప్రముఖుల నివాళులు.. బిపిన్ రావత్ అంత్యక్రియలు అక్కడే..

by  |
Madhulika Rawat
X

దిశ, వెబ్‌డెస్క్ : బుధవారం మధ్యాహ్నం తమిళనాడులోని కోయంబత్తూర్-కూనూర్​మధ్యలో హెలికాప్టర్​ప్రమాదానికి గురై భారత త్రిదళాధిపతి(CDS) జనరల్ బిపిన్​రావత్ దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో బిపిన్ రావత్ భార్య మధులిక రావత్ కూడా మృత్యువాతపడ్డారు. ఇదిలా ఉండగా శుక్రవారం ఢిల్లీలో వారి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. గురువారం సాయంత్రం వారి భౌతికకాయాలను సైనిక విమానంలో ఢిల్లీకి తరలించనున్నట్టు అధికారులు తెలిపారు.

వారి పార్థివదేహాలను ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రజల సందర్శనార్థం ఉంచనున్నారు. ఆ తర్వాత కామరాజ్ మార్గ్ నుంచి ఢిల్లీ కంటోన్మెంట్‌లోని బ్రార్ స్క్వేర్ శ్మశానవాటికకు అంతిమయాత్రగా తీసుకువెళ్లి.. అక్కడ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందిన వారికి వెల్లింగ్టన్‌లోని మద్రాస్ రెజిమెంటల్‌ కేంద్రంలో గురువారం ఉదయం పలువురు ప్రముఖులు నివాళులర్పించనున్నారు. తమిళనాడు సీఎం స్టాలిన్ సహా పలువురు ప్రముఖులు నివాళులు అర్పించనున్నట్టు తెలుస్తోంది.

Next Story

Most Viewed