అచ్చంపేటలో ఊపందుకున్న పశువుల సంత..

by  |
అచ్చంపేటలో ఊపందుకున్న పశువుల సంత..
X

దిశ, అచ్చంపేట : నాగర్ కర్నూల్ జిల్లాలోని అచ్చంపేట మున్సిపల్ కేంద్రంలో శనివారం రెండో సారీ సంత సాగడంతో మున్సిపల్ చైర్మన్ నరసింహ గౌడ్ మరియు అధికారులు నియోజకవర్గ ప్రజలు వ్యాపారస్తులు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. గత శనివారం అచ్చంపేట సమున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు సహకారంతో పశువుల, గొర్రెల, మేకల సంతలను ప్రారంభించారు.

ఊపందుకున్న సంత..
నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం గతం నుండి ఒకే ఒక సొంత ఉప్పునుంతల మండలం వెల్టూరు వద్ద మేకలు, గొర్రెల మాత్రమే క్రయ విక్రయాలు జరిగాయి. కానీ అచ్చంపేట మున్సిపల్ కేంద్రం లో నూతనంగా మొదటిసారిగా ఏర్పాటుచేసిన పశువుల, గొర్రెల, మేకల, నాటు కోళ్లు, మరియు గేదెల సంత శనివారం మరింత ఊపందుకుంది. నియోజకవర్గ నలుమూలల నుండే కాకుండా పొరుగు జిల్లాల నుండి క్రయ విక్రయాలు వ్యాపారస్తులు పెద్ద మొత్తంలో తరలివచ్చారు.

కలిసొచ్చిన దసరా పండుగ..
పట్టణంలో ఏర్పాటు చేసిన సంత కు వచ్చే వారం రోజుల లో దసరా పండుగ ఉండడం వలన సంతకు మరింత కలిసొచ్చిందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రెండో సంత రోజు ఆశించిన మేరకు వ్యాపారస్తులు రైతులు రావడం నిర్వాహకులకు సంతృప్తిని కలిగిస్తోంది.

మధ్య దళారుల ప్రమేయం ఉండదు..
మిగతా సంతల మాదిరిగా ఈ సంతలో రైతులకు వ్యాపారస్తుల మధ్యనా, మధ్య దళారుల ప్రమేయం లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటామని మున్సిపల్ శాఖ అధికారులు తెలిపారు. మధ్య దళారుల ప్రమేయం ఉండడం వలన రైతు నష్టపోయే అవకాశం ఉన్నందున పటిష్టమైన నియమ నిబంధనలు అమలు చేసేందుకు నిర్ణయాలు తీసుకోబోతున్నారు.

నెల పాటు ఎలాంటి రుసుము వసూలు చేయం..
రానున్న నెల రోజుల పాటు క్రయ విక్రయాలు చేసే వ్యాపారస్థులు మరియు రైతుల నుండి ఎలాంటి రుసుము వసూలు చేయమని చైర్మన్ నరసింహ గౌడ్ తెలిపారు. గత వారం తో పోల్చుకుంటే ఈ వారం జిల్లా నలుమూలల నుండే కాకుండా హైదరాబాద్, నల్లగొండ జిల్లాలోని మల్లేపల్లి, డిండి మరియు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వ్యాపారస్తులు వచ్చారని తెలిపారు. వ్యాపారస్తులకు ఇబ్బందులు కలవకుండా మేకలు గొర్రెలు నాటు కోళ్లు మరియు ఆవులు గేదెలకు వేరువేరుగా ఏర్పాటు చేయుటకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. సంతకు వచ్చే రైతులు వ్యాపారస్తులకు ఇబ్బందులు తలెత్తకుండా మున్సిపల్ కౌన్సిలర్ మరియు మున్సిపల్ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తున్నారని తెలిపారు. అలాగే మూగజీవాలకు మంచినీటి వసతి కోసం నీటి తొట్లు ఏర్పాటు చేశామని, ఇతర సౌకర్యాలు చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు.

Next Story

Most Viewed