విద్య, ఉద్యోగార్థుల కోసం ‘దిశ కెరీర్' ఈ ఫీచర్స్‌తో…

by  |
విద్య, ఉద్యోగార్థుల కోసం ‘దిశ కెరీర్ ఈ ఫీచర్స్‌తో…
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో పాఠకులకు వార్తలను అందించడంలో కొత్త ఒరవడిని సృష్టించిన ‘దిశ’ మరో ముందడుగు వేసింది. విద్యార్థులు, ఉద్యోగార్థులకు సరైన దిశానిర్దేశం చేయడం కోసం ‘దిశ కెరీర్’ వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. ‘దిశ’ ఉనికిలోకి వచ్చిన ఏడాదిలోనే ఈ వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తేవడం విశేషం. పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులు మొదలు విద్యార్హతకు తగిన ఉపాధి అవకాశాలు పొందడానికి అవసరమైన సమాచారం వరకు అన్నింటినీ అందించడం ‘దిశ కెరీర్’ ప్రధాన లక్ష్యం. నోటిఫికేషన్ల రూపంలో స్కాలర్‌షిప్స్, ఫెలో‌షిప్స్, ఇంటర్న్‌షిప్స్, అకాడమిక్, ప్రవేశ పరీక్షలకు సంబంధించిన సమాచారం పొందవచ్చు. కెరీర్స్ అండ్ కోర్సెస్‌లో భాగంగా విభిన్నమైన కెరీర్ అవకాశాలు, పలు రకాల కోర్సుల సమాచారం అందుబాటులో ఉంటుంది.

కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో భాగంగా బ్యాంక్స్, పోలీస్, ఆర్ఆర్‌బీ, ఎస్‌ఎస్‌సీ, సివిల్స్ తదితర పోటీ పరీక్షల షెడ్యూల్‌, ప్రిపరేషన్ ప్లాన్‌లను పొందవచ్చు. పోటీ పరీక్షల్లో నెగ్గుకు రావాలంటే కరెంట్ అఫైర్స్‌లో పట్టు సాధించాల్సిందే. అందుకోసం ఏరోజుకు ఆరోజు నిత్య నూతన వర్ధమాన అంశాలు దిశ కెరీర్‌ వెబ్‌సైట్ ‌లో అందుబాటులో ఉండనున్నాయి. ప్రస్తుతం అన్ని పోటీ పరీక్షలకు ఆంగ్లం తప్పనిసరి. ఇందులో ప్రావీణ్యం అభ్యర్థి భవితవ్యాన్ని తేల్చనున్నది. దీనిని దృష్టిలో పెట్టుకుని వొకాబులరీ, గ్రామర్, స్పోకెన్ ఇంగ్లీష్ సమాచారం కూడా అందించనుంది. ఎంత ప్రతిభ ఉన్నా సరైన మార్గదర్శకం లేకపోతే కూడా విజయం సాధించడం కష్టం. అందుకే పలువురు నిపుణులైన సివిల్స్, గ్రూప్స్ ఫ్యాకల్టీల గైడెన్స్‌ను వీడియో రూపంలో అందుబాటులోకి తీసుకురానుంది దిశ కెరీర్ వెబ్సైట్.


Next Story

Most Viewed