అద్దె వసూలు చేయొద్దన్న వినలే..ఒక్క కంప్లైంట్‌తో

by  |
అద్దె వసూలు చేయొద్దన్న వినలే..ఒక్క కంప్లైంట్‌తో
X

కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించారు. నిత్యాసరాల కోసం తప్ప అనవసర విషయాలకు బయటకు వెళ్లరాదని, ఎక్కడివారు అక్కడే ఉండాలని, తప్పనిసరిగా మాస్కులు ధరించాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. అసలే దేశ రాజధానిలో కరోనా విలయతాండవం చేస్తోంది. చాలా మంది ఇతర రాష్ట్రాలకు చెందిన వారు ఢిల్లీలోనే చిక్కుకుపోయారు. అందులో ఉన్నత చదువుల కోసం వెళ్లిన విద్యార్థులు, ఆఫీసు పనుల మీద వెళ్లిన వారు, అక్కడే స్థిరపడిన వారు ఇలా చాలా మంది భయం గుప్పిట్లో జీవనం సాగిస్తున్నారు.విపత్కర సమయంలో పేదలను ఇంటి అద్దె అడుగ రాదని కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పని ఉంటేనే బతుకుదెరువు..అలాంటిది పనిలేని సమయంలో అద్దెలు, బిల్లులు కట్టలేని స్థితిలో ఉన్నవారు ఈ దేశంలో చాలా మందే ఉన్నారు. వారందరినీ దృష్టిలో పెట్టుకునే ఈ మేరకు ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి.ఈ క్రమంలోనే ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఢిల్లీలోని పలువురు ఇంటి యజమానులు కిరాయి కోసం బలవంతం చేశారు. వత్తిడి తీవ్రతరం కావడంతో దేశ రాజధానిలోని ముఖర్జీనగర్‌లో అద్దె ఇళ్లలో ఉంటూ చదువుకుంటున్న విద్యార్థులు ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ అధికారులకు సమాచారం అందించారు. వారు స్థానిక పోలీసుల సహకారంతో 8 మంది ఇంటి యజమానులపై ఐపీసీ సెక్షన్ 188 కింద కేసు నమోదు చేశారు. డిజాస్టర్ యాక్ట్ ప్రకారం ఈ కేసులో ఇంటి యజమానులకు నెల రోజుల జైలు శిక్ష, రూ.200ల జరిమానా..కేసు తీవ్రతను బట్టి ఒక్కోసారి రెండు విధించవచ్చని పోలీసులు వివరించారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న తమ నుంచి అద్దె డిమాండ్ చేస్తున్నారని విద్యార్థుల నుంచి ఫిర్యాదు అందడంతో వారిపై కేసులు పెట్టినట్టు డీసీపీ విజయంత ఆర్యా తెలిపారు.


Next Story

Most Viewed