బ్రేకింగ్ న్యూస్.. టీఆర్ఎస్ సీనియర్ నేతపై కేసు నమోదు

by  |
Rice-Millu-1
X

దిశ‌, న‌ర్సాపూర్‌: ప్రభుత్వం ప్రతి నెలా పేద‌ల‌కు ఇస్తున్న రేష‌న్ బియ్యాన్ని అక్రమంగా కొనుగోలు చేస్తూ రీసైక్లింగ్ చేస్తుండగా రైస్ మిల్లుపై విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు. 29 వాహ‌నాల‌ను సీజ్ చేసి, రైస్ మిల్లు ఓనర్, టీఆర్ఎస్ నేత‌పై కేసు న‌మోదు చేశారు. వివ‌రాల్లోకెళితే.. న‌ర్సాపూర్ మండ‌ల ప‌రిధిలోని కాగ‌జ్‌మ‌ద్దూర్ గ్రామ స‌మీపంలోని శివ‌సాయి ఇండ‌స్ట్రీ రైస్ మిల్లుపై మంగ‌ళ‌వారం విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు. 2 వేల క్వింటాళ్ల రేష‌న్ బియ్యం నిల్వ ఉన్నట్లు గుర్తించారు. 29 ట్రాలీ వాహ‌నాల‌ను సీజ్ చేశారు. రైస్ మిల్లు యజమాని, న‌ర్సాపూర్ ప‌ట్టణానికి చెందిన టీఆర్ఎస్ సీనియ‌ర్ నాయ‌కుడు శ్రీ‌ధ‌ర్‌గుప్తపై కేసు న‌మోదు చేశారు. తనిఖీల్లో విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ రామ‌చంద్రాపూరం సీఐ ప్రభాకర్ రెడ్డి, ఎస్ఐ ప్రవీణ్ రెడ్డి, కానిస్టేబుల్‌లు చ‌ర‌ణ్‌, మ‌ధు, డిప్యూటీ ఎమ్మార్వో సాజిత్, ఆర్ఐలు సురేష్‌, హ‌రీష్ త‌దిత‌రులు ఉన్నారు.

Next Story

Most Viewed