బెల్ట్ షాపునకు వేలం..కేసు నమోదు

by  |

దిశ, నల్లగొండ: గ్రామంలో అనుమతి లేకుండా బెల్ట్ షాపునకు వేలం నిర్వహించిన కొందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈఘటన యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం శర్బనాపురం గ్రామంలో చోటు ఆదివారం చేసుకుంది. సర్పంచు భర్త ఈ నెల 8న అనుమతి లేకుండా బెల్ట్ షాప్‌నకు వేలం నిర్వహించాడు. దీనిని గ్రామంలోని కొందరు యువకులు అడ్డుకున్నారు. పైగా గ్రామ పంచాయతీ నిధుల కోసమే ఈ వేలం వేసినట్టు చెప్పడంతో ఉద్రిక్తతకు దారి తీసింది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని వివరాలు సేకరించారు. గ్రామంలో అనుమతి లేకుండా బెల్ట్‌షాప్‌నకు వేలం నిర్వహించినట్టు గుర్తించి వారిపై నమోదు చేశారు. కాగా సర్పంచ్ భర్త ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని గ్రామస్థులు ఆరోపించారు. గ్రామంలో తాగు నీటి సమస్య ఉన్నా ఆగమేఘాల మీద బెల్ట్ షాపునకు వెలం నిర్వహించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.



Next Story