2021 తర్వాతే పూర్తి స్థాయి వ్యాక్సిన్ : WHO

by  |
2021 తర్వాతే పూర్తి స్థాయి వ్యాక్సిన్ : WHO
X

దిశ, వెబ్‌డెస్క్ :ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా కట్టడికి వ్యాక్సిన్‌ అభివృద్ధికి ప్రపంచ దేశాలు పోటీ పడుతున్నాయి. ఇప్పటికే క్లినికల్ ట్రయల్స్‌ను కూడా నిర్వహించగా, సానుకూల ఫలితాలు వచ్చాయని కొన్ని దేశాలు ప్రకటించుకున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాదిలోపే వ్యాక్సిన్‌ వస్తుందని ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే, 2020లో పూర్తిస్థాయిలో టీకా అందుబాటులోకి వచ్చే అవకాశం లేదని, 2021 తర్వాతే అవకాశాలున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటిచింది.

డబ్ల్యూహెచ్‌వో అత్యవసర విభాగ అధిపతి మైక్‌ ర్యాన్ మీడియాతో మాట్లాడుతూ..‌ ప్రపంచంలోని పలు దేశాల్లో వివిధ వ్యాక్సిన్లు అభివృద్ధి దశలో ఉన్నాయని, కొన్ని మూడో దశ ప్రయోగాలకు చేరుకున్నాయని గుర్తు చేశారు. ఏ ఒక్కటీ విఫలం కాకపోవడం శుభపరిణామమని పేర్కొన్నారు. వ్యాక్సిన్‌ వచ్చాక పంపిణీలో ఎలాంటి తారతమ్యాలు ఉండవన్నారు.
రష్యాలోని సెషనోవ్‌ యూనివర్సిటీ టీకా ఆగస్టులోనే తీసుకొస్తుందని ప్రచారం జరుగుతోంది. మరోవైపు చైనాలో మూడో దశ ట్రయల్స్‌ ప్రారంభించిందని.. బ్రిటన్‌కు చెందిన ఆక్స్‌ఫర్డ్ ట్రయల్స్ సక్సెస్ కాగా, భారత్‌ బయోటెక్ కోవాగ్జిన్‌ తొలి దశ మానవ ప్రయోగాలు కొనసాగిస్తోంది.ఏదేమైనా వచ్చే ఏడాదిలోనే కరోనాకు పూర్తి స్థాయిలో వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టంచేసింది.

Next Story

Most Viewed