SSC CGL టైర్ - 2: CHSL టైర్ -1 పరీక్ష తేదీలు అనౌన్స్

by Dishanational4 |
SSC CGL టైర్ - 2: CHSL టైర్ -1 పరీక్ష తేదీలు అనౌన్స్
X

దిశ, కెరీర్: కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసేందుకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్‌సీ సిజీఎల్, సీహెచ్ఎస్ఎల్ పరీక్షల తేదీలు వెల్లడించింది. ఇప్పటికే సీజీఎల్ టైర్ - 1 పరీక్ష పూర్తయింది. ఇప్పుడు తాజాగా టైర్ 2 పరీక్ష తేదీలను ఖరారు చేసింది. గ్రూప్ బీ, సీ విభాగాల్లో సుమారు 20 వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఈ పరీక్షను మార్చి 2 నుంచి 7 వరకు నిర్వహించనున్నట్లు ఫిబ్రవరి 6న ప్రకటించింది. లోయర్ డివిజన్ క్లర్కులు, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్లు వంటి 4500 ఉద్యోగాల భర్తీకి నిర్వహించే కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ పరీక్ష టైర్ - 1ను మార్చి 9 నుంచి 21 వరకు నిర్వహించనున్నట్లు తాజాగా ప్రకటించింది. అభ్యర్థులు ఎస్ఎస్‌సీ వెబ్‌సైట్ ద్వారా మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు.

వెబ్‌సైట్: https://ssc.nic.in/



Next Story