9 - 12వ తరగతి విద్యార్థులకు స్కాలర్ షిప్

by Disha Web Desk 17 |
9 - 12వ తరగతి విద్యార్థులకు స్కాలర్ షిప్
X

దిశ, కెరీర్: 9 నుంచి 12వ తరగతి చదువుతున్న డ్రైవర్ల పిల్లల కోసం మహీంద్రా ఫైనాన్స్ సాక్షం స్కాలర్షిప్ 2022-23 ప్రకటన విడుదల చేసింది. ఆర్థికంగా వెనుకబడిన డ్రైవర్ల పిల్లల చదువులు కొనసాగించడానికి ఈ స్కాలర్ షిప్ ను మహీంద్రా ఫైనాన్స్ అందిస్తోంది. అర్హులైన విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవచ్చు.

అర్హత:

విద్యార్థులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ విద్యార్థులు మాత్రమే దరఖాస్తుకు అర్హులు.

విద్యార్థులు 9 నుంచి 12 తరగతులు చదువుతున్న వారై ఉండాలి.

గత పరీక్షలో 60 శాతం మార్కులు సాధించి ఉండాలి.

వాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన డ్రైవర్ పిల్లలు అయి ఉండాలి.

విద్యార్థి వార్షిక కుటుంబ ఆదాయం రూ. 4 లక్షల లోపు ఉన్న వారు అర్హులు.

స్కాలర్షిప్: 9 నుంచి 10 తరగతి చదువుతున్న విద్యార్థులకు ఏడాదికి రూ. 8,000, అలాగే 11 నుంచి 12 తరగతి చదువుతున్న వారికి ఏడాదికి రూ. 10,000 అందిస్తారు.

కావలసిన పత్రాలు:

గత పరీక్షల మార్క్ షీట్.

ఫొటో ఐడెంటిటీ ప్రూఫ్

కుటుంబ ఆదాయ ధ్రువపత్రం

చదువుతున్న పాఠశాల అడ్మిషన్ ప్రూఫ్

విద్యార్థి బ్యాంక్ అకౌంట్ వివరాలు

డ్రైవర్ కమర్షియల్ డ్రైవింగ్ లైసెన్స్

కాంట్రాక్ట్ కాపీ/ఇన్ కమ్ ప్రూఫ్/ఎంప్లాయి గుర్తింపు కార్డ్..

అడ్రస్ ప్రూఫ్

విద్యార్థి ఫొటోగ్రాఫ్

చివరి తేదీ: అక్టోబర్ 31, 2022

వెబ్‌సైట్: https://www.buddy4study.com


Next Story