- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ONGC Jobs: ONGCలో అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..ఈ అర్హతలు ఉంటే చాలు
దిశ, వెబ్‌డెస్క్:డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగం లేక ఇంటి దగ్గర ఖాళీగా ఉంటున్నారా. అయితే మీకోసం ప్రభుత్వ రంగ సంస్థ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్(ONGC) గుడ్ న్యూస్ చెప్పింది. 2236 అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.ఆసక్తి గల అభ్యర్థులు ONGC అధికారిక వెబ్‌సైట్ www.ongcapprentices.ongc.co.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు ఒక సంవత్సరం పాటు ట్రైనింగ్ ఉంటుంది.దరఖాస్తు చేసుకోవడానికి లాస్ట్ డేట్ 25 అక్టోబర్ 2024.
పోస్టుల వివరాలు:
- గ్రాడ్యుయేట్ అప్రెంటీస్
- డిప్లొమా అప్రెంటీస్
- ట్రేడ్ అప్రెంటీస్
విద్యార్హత:
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులకు డిగ్రీ, డిప్లొమా అప్రెంటిస్ పోస్టులకు మూడు సంవత్సరాల డిప్లొమా చేసి ఉండాలి.అలాగే ట్రేడ్ అప్రెంటీస్ పోస్టులకు 10 లేదా 12వ తరగతి చదివి ఉండాలి
వయోపరిమితి:
25.10.2024 నాటికి అభ్యర్థులు వయస్సు 18 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు, దివ్యాంగులుకు 10 ఏళ్లు వయోసడలింపు ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ:
అప్రెంటిస్‌ల ఎంపిక అర్హత పరీక్షలో పొందిన మార్కులు, వైద్య పరీక్షల ఆధారంగా ఉంటుంది.
జీతం:
గ్రాడ్యుయేట్ అప్రెంటీస్‌కు నెలకు రూ.9,000. డిప్లొమా అప్రెంటీస్‌కు నెలకు రూ.8,050. ట్రేడ్ అప్రెంటీస్‌కు నెలకు రూ.7,000 - రూ.8,050 వరకు జీతం ఇవ్వనున్నారు.