ఆంధ్రప్రదేశ్ TTDలో ఉద్యోగాలు.. నెలకు రూ.50వేల వరకు వేతనం

by Dishafeatures1 |
ఆంధ్రప్రదేశ్ TTDలో ఉద్యోగాలు.. నెలకు రూ.50వేల వరకు వేతనం
X

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిరుద్యోగులకు శుభవార్త. తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) ఆధ్వర్యంలో శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణ ట్రస్ట్.. కాంట్రాక్ట్ విధానంలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:

*మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 9

*దరఖాస్తుకు చివరి తేది: 2022 ఏప్రిల్ 11

*ఇందులో ఫార్మ్ నేజర్‌/గోశాల మేనేజర్‌–03, కాంపౌండర్‌/డెయిరీ అసిస్టెంట్‌–06 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.

*గోశాల మేనేజర్ ఉద్యోగానికి సంబంధించి వెటర్నరీ సైన్స్ లో బ్యాచిలర్ డిగ్రీ/పోస్ట్ గ్రాడ్యుయేన్ డిగ్రీ పాసై ఉండాలి.

*ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.54,060 వేతనం చెల్లిస్తారు.

*డెయిరీ అసిస్టెంట్ ఉద్యోగానికి సంబంధించి పోస్టును అనుసరించి పదో తరగతి, రెండేళ్ల యానిమల్‌ హజ్బెండరీ పాలిటెక్నిక్‌ కోర్సు ఉత్తీర్ణులవ్వాలి.

*ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.29,980 వేతనం చెల్లిస్తారు.

*ఆఫ్ లైన్ దరఖాస్తును The Director, Sri Venkateswara Cow Protection Trust, TTD, Chandragiri Road, Tirupati – 517502, Andhra Pradesh చిరునామకు పంపించాలి.

*నోటిఫికేషన్ పూర్తి సమాచారం, దరఖాస్తు ప్రక్రియకు https://www.tirumala.org/ వెబ్ సైట్ ను చూడొచ్చు.

Next Story

Most Viewed